తమిళ దర్శకుడితో పవన్ సినిమా

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా రోజుల తరువాత ఆడియేన్స్ కు ఒక పెద్ద షాక్ ఇచ్చాడనే చెప్పాలి. అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు మాటలు అందిస్తూ స్క్రీన్ ప్లే కూడా సెట్ చేసిన ఆయన ఫైనల్ గా అనుమానాలను నిజం చేసేశారు. మొదటి నుంచి ఆ రీమేక్ పై త్రివిక్రమ్ హ్యాండ్ ఉన్నట్లు చాలా క్లియర్ గా అర్ధమయ్యింది. ఇక ఫైనల్ గా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వడంతో అభిమానులకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చేసింది.

అయితే ఈ సినిమాకు మొదటి నుంచి కూడా దర్శకుడి కంటే ఎక్కువగా త్రివిక్రమ్ హోమ్ వర్క్ చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల దర్శకుడు, నటుడు సముథ్రకని ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. త్రివిక్రమ్ గారే సినిమాలో నటించమని చెప్పినట్లు వివరణ ఇవ్వడంతో మొదటి నుంచి కూడా అన్ని విషయాల్లో త్రివిక్రమ్ ఇన్వాల్మెంట్ ఉన్నట్లు అర్ధమయ్యింది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

ఇక సినిమాకు దర్శకుడు సాగర్ చంద్ర అయినప్పటికీ త్రివిక్రమ్ ద్వారానే సినిమా మొత్తం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.