క‌న్ఫ్యూజ్ చేస్తున్న ప‌వ‌న్.. ఫ‌స్ట్రేష‌న్‌లో ఫ్యాన్స్‌..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా వ‌రుస‌గా సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు. ఇప్ప‌టికే వ‌కీల్ సాబ్ సెట్స్ పైకి వెళ్ళ‌గా ఆ త‌ర్వాత లైన్‌లో నాలుగు సినిమాలు ఉన్నాయి. వ‌కీల్ సాబ్ షూటింగ్ అయిపోగా క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే సినిమాలో ప‌వ‌న్ న‌టించ‌నున్నాడు. ఇప్ప‌టికే ఈ మూవీకి సంబంధించి ఇప్ప‌టికే రెండు షెడ్యూళ్ళు పూర్త‌య్యాయ‌ని స‌మాచారం. ఈ సినిమాతో పాటు మ‌ల‌‌యాళం మూవీ అయ్య‌ప్ప‌న్ కొషియం చిత్రాన్ని కూడా సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే అందులో మ‌రో కీల‌క పాత్ర‌కోసం వేట సాగుతూనే ఉంది. ఈ సినిమాలో ప‌వ‌న్‌కు స‌మానంగా ఉండే పాత్ర కావ‌డంతో హీరో ఎంపిక డైల‌మాలో ఉంది.

మొద‌ట రానా పేరు వినిపించినా ఇంకా ఫైన‌లైజ్ కాలేదు. దీంతో అయ్య‌ప్ప‌న్ కొషియం ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో అనేది చిత్ర యూనిట్ ద‌గ్గ‌ర స‌మాధానం లేదు.ఇక ఆ త‌ర్వాత గ‌బ్బ‌ర్ సింగ్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్‌తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు ప‌వ‌న్. అయితే ఇప్పటి వ‌ర‌కు స్కిప్ట్ వ‌ర్క్ పూర్తి కాలేద‌ని తెలుస్తోంది. దీంతో హ‌రీష్‌తో సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో అనేది ఇంకా తేలాల్సి ఉంది. అదే వ‌రుస‌లో సురేంద‌ర్ రెడ్డితో సినిమా చేసేందుకు ప‌వ‌న్ ఓకే చెప్పిన సంగ‌తి తెలిసిందే. అంత‌కంటే ముందు సురేంద‌ర్ రెడ్డి అక్కినేని హీరో అఖిల్‌తో సినిమా పూర్తి చేయాల్సి ఉంది. దీంతో సురేంద‌ర్ రెడ్డి సినిమా కూడా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంద‌నే తెలీదు.

Three Pawan Kalyan fans no more of electric shock1

ఇక తాజాగా జానీ మాస్ట‌ర్ డైరెక్ష‌న్ సినిమా చేసేందుకు ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని, రామ్ చ‌ర‌ణ్ ఈ సినిమాని నిర్మిస్తాడ‌ని రెండు రోజులుగా వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అది ఎప్పుడు మొద‌ల‌వుతుంద‌నేది అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలే. దీంతో ప‌వ‌న్ సినిమాల లిస్ట్ చూస్తుంటే ఫ్యాన్స్ ఆనందంలో ఉన్నా, ఏది అనుకున్న టైమ్‌కు సెట్స్ పైకి వెళ్ళ‌క పోవ‌డంతో పీకే ఫ్యాన్స్‌కు తిక్కలేస్తుంది. దీంతో వ‌రుస సినిమాలు ప‌వ‌న్‌ను క‌న్ఫ్యూజ‌న్‌లో ప‌డేస్తున్నాయ‌ని, దీంతో ప‌వ‌న్ దూకుడు పెంచినా ఫ్యాన్స్‌లో మాత్రం రోజురోజుకీ ఫ‌స్ట్రేష‌న్ పెరిగిపోతుంద‌ని సోష‌ల్ మీడియాలో చ‌ర్చించుకుంటున్నారు.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Share.