కమిషన్ పద్దతిలో పవన్ సినిమా అమ్మేశారు!

రీఎంట్రీలో పవన్ కళ్యాణ్ వరుసబెట్టి సినిమాలు చేస్తున్నారు. ‘వకీల్ సాబ్’ షూటింగ్ పూర్తయిపోయింది. మరో నెల రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతోంది. దీని తరువాత పవన్ నటిస్తోన్న సినిమాలకు కూడా భారీ బిజినెస్ ఆఫర్లు వస్తుండడం విశేషం. దర్శకుడు క్రిష్ రూపొందిస్తోన్న చారిత్రక నేపధ్యం ఉన్న సినిమాలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు.

ఈ సినిమా కోసం రూ.150 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు. సినిమా బడ్జెట్ రేంజ్ లోనే బిజినెస్ ఆఫర్లు కూడా వస్తున్నాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు. రిలీజ్ కి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ఇంతలోనే కొన్ని ఏరియాలకు బిజినెస్ డీల్స్ క్లోజ్ చేస్తున్నారట. ఓవర్సీస్ హక్కులు ఇప్పటికే అమ్ముడైపోయినట్లు సమాచారం. ఫార్స్ ఫిలిమ్స్ అనే సంస్థ కమిషన్ పద్దతిలో ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం.

ముందుగా నిర్మాత ఏ.ఎం.రత్నంకు రూ.5 కోట్ల అడ్వాన్స్ చెల్లించింది ఈ సంస్థ. కరోనా కారణంగా ఓవర్సీస్ సినిమా బిజినెస్ బాగా దెబ్బతింది. గతంలా భారీ ఆఫర్లు రావడం లేదు. చేసుకున్న డీల్స్ ని కూడా క్యాన్సిల్ చేస్తున్నారు. రేట్లు తగ్గించమని అడుగుతున్నారు. కానీ వచ్చే ఏడాదికి పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని… ఎప్పటిలానే సినిమాలు బాగా ఆడుతాయని ఆశిస్తున్నారు. పవన్-క్రిష్ సినిమా ఓవర్సీస్ లో రికార్డులు సృష్టిస్తుందని నమ్ముతున్నారు.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.