పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండను చూసైనా ఈ స్టార్ హీరోలు మారాలి

ఒక సాధారణ వ్యక్తి కంటే సెలబ్రిటీలకు రీచ్ ఎక్కువ అనేది ఎవ్వరైనా సరే ఒప్పుకోవాల్సిన విషయం. అందుకే.. పలు సోషల్ ఇష్యూస్ విషయంలో సినిమావాళ్లు ఇన్వాల్వ్ అయితే.. ఆ ఇష్యూకి రీచ్ ఎక్కువగా ఉంటుంది. మొన్నామధ్య అమేజాన్ ఫారెస్ట్ అగ్నికి ఆహుతి అవుతున్నప్పుడు ప్రపంచం మొత్తం బాధపడింది. మన స్టార్ హీరోల్లో ప్రముఖుడైన మహేష్ బాబు కూడా కాస్త గట్టిగానే స్పందించాడు. ఆ సమయంలో మహేష్ బాబుకి నేచర్ మీద ఉన్న కన్సెంట్ చూసి అందరూ మెచ్చుకొన్నారు. కానీ.. సహజమైన అగ్ని విలాపం వలన కాలిపోతున్న అమేజాన్ అడవి మీద చూపిన శ్రద్ధలో కనీసం సగం కూడా ఏకంగా ప్రభుత్వమే నాశనం చేయాలని చూస్తున్న నల్లమల అడివిపై చూపకపోవడం గమనార్హం.

pawan-kalyan-is-better-than-mahesh-babu-vijay-devarakonda1

ఈ విషయంలో పవన్ కళ్యాణ్ & విజయ్ దేవరకొండ చాలా బెటర్. కనీసం తమ గొంతులను ధ్వనింపజేశారు. నిజానికి “సేవ్ నల్లమల” అనే నినాదాన్ని టాలీవుడ్ లో తొలుత గళమెత్తింది దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన తర్వాత బోలెడు మంది సినిమావాళ్లు తమ గొంతుకులను సోషల్ మీడియా సాక్షిగా వినిపించినప్పటికీ.. పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోల ఎంట్రీతో ఇష్యూకి సీరియస్ నెస్ వచ్చింది. ఇలాంటి తరుణంలో మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి వారు కూడా స్పందిస్తే ఆ ఉద్యమానికి ఊపిరి పోసిన వాళ్లవుతారు. మరి ఈ విషయాన్ని మన స్టార్ హీరోలు, హీరోయిన్లు ఎందుకు పట్టించుకోవడం లేదో వాళ్ళకే తెలియాలి.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Share.