పవన్ మూవీతోనైనా క్రిష్ కోరిక తీరుతుందా..?

అజ్ఞాతవాసి సినిమా తర్వాత జనసేన పార్టీ కార్యకలాపాల్లో బిజీ కావడం వల్ల సినిమాలకు దూరమైన పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో మాత్రం వరుసగా సినిమాల్లో నటిస్తూ అభిమానులను ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. ఏడాది గ్యాప్ లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మూడు సినిమాలు విడుదల కానున్నాయి. పవన్ క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాకు హరిహర వీరమల్లు అనే టైటిల్ ఫైనల్ అయింది. ఇప్పటికే విడుదలైన హరిహర వీరమల్లు ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై భారీగా అంచనాలను పెంచింది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మూడు గెటప్స్ లో కనిపిస్తారని సమాచారం. ఫస్ట్ లుక్ లో పవన్ ఒక గెటప్ లో కనిపించగా రాబోయే రోజుల్లో మిగిలిన గెటప్స్ కూడా రివీల్ అయ్యే అవకాశం ఉంది. మొఘలుల కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ ఒక పాత్రలో వజ్రాల దొంగగా కనిపించనున్నారు. మిగిలిన పాత్రల్లో సిక్కు సైనికులను రక్షించే రక్షకుడిగా, దేశం కొరకు పోరాటం చేసే వీరుడిగా పవన్ కనిపించబోతున్నారు. పవన్ దుస్తులు, ఉపయోగించే వస్తువుల విషయంలో దర్శకుడు క్రిష్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.

ఈ సినిమా కోసం ప్రత్యేకంగా చార్మినార్ సెట్ వేసిన సంగతి తెలిసిందే. నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమా కోసం 170 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ కు జోడీగా నటిస్తున్న నిధి అగర్వాల్ కూడా వజ్రాల దొంగగానే కనిపిస్తున్నట్టు సమాచారం. 2022 సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. కెరీర్ లో ఎన్నో విజయాలు ఉన్నా స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకోని క్రిష్ ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు దక్కుతుందని భావిస్తున్నారు.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.