త్రివిక్రమ్ సలహాతో విలన్ ఫిక్స్..!

మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన అయ్యప్పనున్ కోషియమ్ కి రీమేక్ గా తెలుగులో పవన్ కళ్యాణ్ రానా మల్టీస్టారర్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈసినిమాకి విలన్ ఫిక్స్ అయ్యాడా అంటే నిజమే అంటున్నారు ఫిలిం నగర్ తమ్ముళ్లు. అంతేకాదు, ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సలహాలతో సినిమా స్టార్ కాస్టింగ్ ఫిక్స్ అవుతోందట. అంతేకాదు, ఈ సినిమాకి మాటలు రాసే పనిని కూడా మాటల మాంత్రికుడికి అప్పజెప్పే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అల వైకుంఠపురములో సినిమాలో విలన్ గా చేసిన సముద్రఖనిని త్రివిక్రమ్ శ్రీనివాస్ అప్రోచ్ అయ్యి ఈ సినిమా గురించి చెప్పాడని, దీనికి సముద్రఖని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం తెలుస్తోంది.

రీసంట్ గా పూజాకార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ప్రస్తుతం సముద్రఖని తెలుగులో ట్రిబుల్ ఆర్ సినిమాలో, అలాగే నితిన్ – నాని సినిమాల్లో కీలకమైన రోల్స్ లో నటిస్తున్నాడు. ఇదే కాకుండా ఇంకా తెలుగులో చాలా ఆఫర్లు వస్తున్నాయని రీసంట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ సినిమా గురించి చెప్పగావే వెంటనే ఓకే అనేశానని చెప్తున్నాడు డైరెక్టర్ కమ్ విలన్ గా మారిన సముద్రఖని. ఈ సినిమాకోసం నేను ఎంతగానో ఎదురుచూస్తున్నానని, నన్ను ఎంతగానో తెలుగులో ఆదరిస్తున్నవారందరికీ ధన్యవాదాలు అంటూ ఈ సినిమా గురించి చెప్పాడు.

అంతేకాదు, ఈ సినిమాలో ఐశ్వర్యారాజేష్ ఇంకా సాయిపల్లవిలని హీరోయిన్స్ గా ఎంపిక చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అఫీషియల్ గా త్వరలోనే స్టార్ కాస్టింగ్ గురించి చెప్తారని, సమ్మర్ లో సినిమాని కంప్లీట్ చేసి , దసరాకి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం తెలుస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సితారా ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై తెరకెక్కుతోంది. సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అదీ విషయం.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.