భారీ ఎత్తున్న ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్… అతిధులుగా?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహ రెడ్డి’. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్ర్రాన్ని ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ పై రాంచరణ్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో గాంధీ జయంతి రోజున అంటే.. అక్టోబర్ 2 న విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ‘వి.ఎఫ్.ఎక్స్’ వర్క్ జరుగుతుంది. ఇక మెగాస్టార్ పుట్టిన రోజు సందర్బంగా మేకింగ్ వీడియో, టీజర్ విడుదల చేసి ఈ చిత్రం పై ఆసక్తిని మరింత పెంచారు.

new-problems-for-syeraa-narasimha-reddy-movie1

వీలైనంత ఎక్కువ ప్రమోషన్లు చేయాలని చిరంజీవి, చరణ్ భావిస్తున్నారట. ఇప్పటికే ముంబైలో ప్రెస్ మీట్ తో పాటు.. ఓ ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నారు. ఇక ఈ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబర్ మూడో వారంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ వేడుకకి చిత్రంలోని నటీనటులతో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లు ముఖ్య అతిధులుగా హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. మొదట హైదరాబాద్‌లో ఈ వేడుకని ఘనంగా నిర్వహించిన తరువాత.. చెన్నై, బెంగళూర్ లలో కూడా ప్రమోషనల్ ఈవెంట్ లను నిర్వహిస్తున్నారని తెలుస్తుంది.

Share.