ప్రభాస్ ను టార్గెట్ చేసిన ‘గీత గోవిందం’ డైరెక్టర్..!

‘బాహుబలి’ ‘బాహుబలి2’ ‘సాహో’ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు ప్రభాస్. ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో ‘జాన్'(వర్కింగ్ టైటిల్) అనే చిత్రం చేస్తున్న ప్రభాస్ ఆ తరువాతి సినిమా ఏ డైరెక్టర్ తో చేస్తాడు అనే విషయం పై చర్చ మొదలైంది. ‘కె.జి.ఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, సురేందర్ రెడ్డి వంటి క్రేజీ డైరెక్టర్ల పేర్లు వినిపించాయి.

Parasuram with Prabhas

ఇప్పుడు మరో యంగ్ డైరెక్టర్ పేరు వినిపిస్తుంది. ఆయన మరెవరో కాదు ‘గీత గోవిందం’ డైరెక్టర్ పరశురామ్ (బుజ్జి). ఏడాది పైనే ఈయన సినిమా చేయకుండా హీరోల చుట్టూ తిరుగుతున్నాడు. బన్నీ, మహేష్, అఖిల్ వంటి వారితో సినిమా చేయాలని ట్రై చేసాడు కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఈయనకి యూవీ. క్రియేషన్స్ నుండీ పిలుపు వచ్చిందట. ‘ప్రభాస్ 21’ సినిమాకి మంచి కథ కోసం వారు వెతుకుతున్నారట. ఈ క్రమంలో పరశురామ్ ను పిలిచినట్టు తెలుస్తుంది. ప్రభాస్ తో సినిమా అంటే కచ్చితంగా తెలుగుతో పాటు హిందీ ప్రేక్షకుల్ని మెప్పించే విధంగా ఉండాలి. మరి మన బుజ్జిగాడిని (ప్రభాస్) … బుజ్జి(పరశురామ్) మెప్పించగలడో లేదో చూడాలి..!

రాజుగారి గది 3 సినిమా రివ్యూ & రేటింగ్!
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.