పాగల్ లవర్ గా విశ్వక్ సేన్ అరిపించాడుగా..!

దిల్ రాజు సమర్పణలో లక్కీమీడియా పతాకంపై వస్తున్న సినిమా పాగల్. ఈ సినిమా టీజర్ ని అఫీషియల్ గా రిలీజ్ చేసింది చిత్రయూనిట్. పాగల్ లవర్ గా ఇందులో విశ్వక్ సేన్ తన మార్క్ ని మరోసారి ప్రేక్షకులకి చూపించేందుకు రెడీ అయ్యాడు. ఎవడ్రా నా లవర్ ని ఏడిపించిందంటూ చెప్పే డైలాగ్స్, అలాగే నా లవర్ ఫేస్ లో హ్యాపీనెస్ కనబడట్లేదురా.. స్ట్రాంగ్ గా కొట్టండి అంటూ హీరో రెచ్చిపోయి మరీ రౌడీలని అడుగుతున్నాడు. నా లవ్ అంత స్ట్రాంగ్ గా వైల్డ్ గా కొట్టండి అంటూ బ్రతిమిలాడుతున్నాడు.

ఇక లాస్ట్ లో రాహుల్ రవీంద్రన్ వేసిన ఫంచ్ డైలాగ్ కూడా టీజర్ లో హైలెట్ అనే చెప్పాలి. ఓవర్ ఆల్ గా చూస్తుంటే పాగల్ గా వస్తున్న విశ్వక్ సేన్ ఈసారి సాలిడ్ హిట్ కొట్టేలాగానే కనిపిస్తున్నాడు. నరేష్ కుప్పిలి డైరెక్ట్ చేస్తున్న ఈసినిమా ఏప్రిల్ 30వ తేదిన విడుదల కాబోతోంది. హిట్ సినిమాతో మంచి హిట్ ని అందుకున్న విశ్వక్ సేన్ ఈసారి రూట్ మార్చి పాగల్ లవర్ గా రాబోతున్నాడు.

టీజర్ లో చూస్తుంటే మనోడికి చాలామంది లవర్స్ ఉన్నట్లుగానే కనిపిస్తోంది. అంతేకాదు, రోజ్ ఫ్లవర్ తీస్కుని ముసలావిడకి ఐ లవ్ యూ చెప్తున్నాడు మనోడు. ఇక హై ఎండ్ యాక్షన్ , కామెడీ సినిమాలో ఉందంటూ టీజర్లో చెప్పకనే చెప్తున్నారు. రాహుల్ రవీంద్రన్ అండ్ గ్యాంగ్ తో మరోసారి విశ్వక్ సేన్ తన మార్క్ యాక్షన్ తో పాగల్ గా ప్రేక్షకులని పలకరించబోతున్నాడన్నమాట. అదీ విషయం.


ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Share.