కుర్రకారు పాయల్ కోసం ఎంత రచ్చ చేశారో..!

చేసినవి కేవలం రెండే రెండు సినిమాలు. ఒకటి బ్లాక్ బస్టర్.. మరొకటి అట్టర్ ప్లాప్. మరో చిన్న సినిమాలో ఐటెం సాంగ్. ఇవి హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ప్రోగ్రెస్ రిపోర్ట్. ఇదిలా ఉంటే.. పాయల్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తన గ్లామర్ తోనూ.. నటన తోనూ యూత్ లో మంచి ఫాలోయింగ్ ను ఏర్పరుచుకుంది. అంతే కాదు మాస్ ఆడియన్స్ లో కూడా ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది.

Paayal Rajput gets grand welcome from fans1

ఇదిలా ఉంటే..ఈరోజు హైదరాబాద్ లో ఒక మొబైల్ స్టోర్ ఓపెనింగ్ కి వెళ్ళింది పాయల్. అక్కడ అభిమానులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఆమె వస్తుందని తెలుసుకున్న అభిమానులు ఉదయం నుండే ఆమె కొరకు ఎదురుచూస్తూ వచ్చారు. ఒక్కసారి పాయల్ ఎంటర్ అవ్వగానే అక్కడి రోడ్లు జనసంద్రంగా మారిపోయాయి. దిల్ సుఖ్ నగర్ లోని ‘టచ్ మొబైల్స్ స్టోర్స్’ ఓపెనింగ్ కు వెళ్ళింది పాయల్. ఇక అక్కడి అభిమానుల్ని చూసి ఆమె తెగ మురిసిపోయిందని తెలుస్తుంది.

రాజుగారి గది 3 సినిమా రివ్యూ & రేటింగ్!
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.