ప్రభాస్ తో ఏది చేయడానికైనా నేను రెడీ అంటున్న హాట్ బ్యూటీ

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ స్టార్ ఇమేజ్ సంపాదించి, సాహో సినిమాతో బాలీవుడ్ లో మరింత క్రేజ్ సంపాదించిన ప్రభాస్ తో నటించడానికి ఏ హీరోయిన్ కైనా చాలా ఇంట్రెస్ట్ తప్పక ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇటీవలే హాట్ బ్యూటీ ఆరెక్స్ 100 ఫెమ్ పాయల్ రాజ్ పుత్ తన మూవీ ప్రమోషనలో ప్రభాస్ చాలా హాట్ అంటూ పొగిడేసింది.

paayal-rajput-about-prabhas1

ఇక వివరాల్లోకి వెళితే, ఆరెక్స్ 100 సినిమాతో పేరు సంపాదించిన పాయల్ రాజ్ పుత్ ఆర్డిఎక్స్ లవ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో విజయ్ దేవరకొండ, ప్రభాస్ ఇద్దరిలో ఎవరు హాట్ అని అడుగగా ప్రభాస్ చాలా హాట్ అని, మంచి ఫిజిక్, యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ చాలా ప్రత్యేకంగా ఉంటాయని ఛాన్స్ రావాలి కానీ ప్రభాస్ తో వెంటనే సినిమా ఓకే చెప్పేస్తా అని సమాధానం చెప్పింది. ఇక ఆరెక్స్ 100 హాట్ భామ ఆర్డిఎక్స్ లవ్ సినిమాతో ప్రేక్షకులను తన అందాలతో ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

Share.