బుజ్జిగా… మెగాస్టార్ సిన్మా కామెడీ ట్రాక్ కొత్తగా తీశారా?

ట్రయిలర్ చూసి సినిమా మీద అంచనాకు రావడం అంటే కవర్ పేజీ చూసి బుక్ మీద ఓ అభిప్రాయానికి వచ్చినట్టే. కవర్ పేజీ చూసి పుస్తకాన్ని ఎప్పుడూ జడ్జ్ చెయ్యవద్దని అంటారు. కానీ, సినిమా మీద ఓ అభిప్రాయానికి రావడానికి ట్రయిలర్లు రిలీజ్ చేస్తారు కాబట్టి ‘ఒరేయ్ బుజ్జిగా’ ట్రయిలర్ చూస్తుంటే మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేసిన ‘బావగారు బాగున్నారా’ సినిమాలో కామెడీ ట్రాక్ గుర్తు వస్తోంది. దాన్ని తిప్పి తీశారా అని అనుమానం కలుగుతోంది.

రాజ్ తరుణ్ హీరోగా, మాళవికా నాయర్, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా విజయ్ కుమార్ కొండా డైరెక్షన్ లో కేకే రాధామోహన్ ప్రొడ్యూస్ చేసిన సినిమా ‘ఒరేయ్ బుజ్జిగా’. ఆహా ఓటీటీలో అక్టోబర్ 2న రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు ట్రయిలర్ రిలీజ్ చేశారు. అది చూస్తే ప్రేక్షకులను నవ్వించడానికి తీసిన సిన్మా అన్నట్టు ఉంది. నో లాజిక్స్… ఓన్లీ ఫన్నీ మూమెంట్స్ అన్నమాట.

రాజ్ తరుణ్, మాళవికా నాయర్, కమెడియన్ సప్తగిరి మధ్య కామెడీ ట్రాక్ మాత్రం ‘బావగారు బాగున్నారా’లో చిరంజీవి, రంభ, బ్రహ్మానందం మధ్య కామెడీ ట్రాక్ ని గుర్తు చేసేలా వుంది. అందులో చిరంజీవిని చంపాలంన్నంత కసితో రంభ వస్తే… తన బదులు బ్రహ్మానందాన్ని చిరు చూపిస్తారు. ‘ఒరేయ్ బుజ్జిగా’లో అటువంటి కన్ ఫ్యూజన్ కామెడీతో ట్రాక్ తీసినట్టు వున్నారు. ‘జయ జానకి నాయక’లో యాక్ట్ చేసిన వాణి విశ్వనాథ్ ఈ సినిమాలో యాక్ట్ చేశారు. పోసాని, నరేష్, మధునందన్, భద్రం తదితరులు ప్రేక్షకులను ఎంతమేరకు నవ్విస్తారో చూడాలి.

Share.