నందమూరి ఫ్యామిలీ నుండి ఎన్టీఆర్ ఒక్కడే మిగిలాడు

ఇండస్ట్రీ పెద్దలుగా కొనసాగుతున్న కుటుంబాలలో నందమూరి ఫ్యామిలీ ఒకటి. నటుడిగా నాయకుడిగా చరిత్ర సృష్టించిన నందమూరి తారకరామారావు ఏర్పరిచిన ప్రస్థానంలో బాలకృష్ణ, హరికృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారక రత్న నటులుగా పరిశ్రమకు పరిచయం అయ్యారు. బాలకృష్ణ ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెడుతూ టాప్ స్టార్స్ లో ఒకరిగా ఎదిగారు. ఆ తరువాత వెండి తెరపై అంతగా సక్సెస్ అయిన హీరో జూనియర్ ఎన్టీఆర్. మెరుపు వేగంతో సాగే డాన్స్ లు, అద్భుతమైన నటన ఎన్టీఆర్ ని అనతి కాలంలోనే టాప్ స్టార్ గా నిలబెట్టాయి. అతి తక్కువ వయసులోనే మాస్ స్టార్ డమ్ తెచ్చుకున్న హీరో జూనియర్ ఎన్టీఆర్. కాగా నందమూరి ఫ్యామిలీ నట వారసత్వం నిలబెట్టే బాధ్యత ఎన్టీఆర్ భుజాలపై పడింది.

Balakrishna, Jr NTR and Kalyan Ram

ఆ కుటుంబం నుండి ఎన్టీఆర్ ఒక్కడే సక్సెస్ ఫుల్ గా దూసుకెళుతున్నాడు. ఇండస్ట్రీ రికార్డులు అందుకున్న బాలయ్య మార్కెట్ ఇప్పుడు ఎంతగా దిగజారిపోయిందో తాజా చిత్రాల వసూళ్లే నిదర్శనం. ఒక యంగ్ హీరో చిత్రానికి వచ్చే వసూళ్లు కూడా బాలయ్య బాబు చిత్రానికి రావడం లేదు. దీనితో బాలయ్య శకం టాలీవుడ్ లో ముగిసినట్లే. ఇక మరో హీరో కళ్యాణ్ రామ్ ది ఇదే పరిస్థితి. ఆయన హీరోగా పరిశ్రమకు పరిచయమై పదిహేడేళ్లు అవుతుంది. ఇన్నేళ్ల కెరీర్ లో కనీసం మూడు హిట్స్ లేవు. పటాస్ హిట్ తరవాత మరో అరడజను ప్లాప్స్ అందుకున్నాడు. అంత పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చి హీరోగా కనీస గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. ఇక తారక రత్న కెరీర్ ఎప్పుడో ముగిసింది. బాలయ్య తరువాత వెండితెరను ఏలతాడు అని నందమూరి అభిమానులు అనేక ఆశలు పెట్టుకున్న మోక్షజ్ఞ, నాకు అసలు సినిమా వద్దని చేతులు పైకి ఎత్తివేశాడు. దీనితో ఒక్క ఎన్టీఆర్ మాత్రమే ఆ ఫ్యామిలీ వారసత్వాన్ని కాపాడే బాధ్యత తీసుకున్నాడు. మరో ప్రక్క మెగాస్టార్ ఫ్యామిలీ లో చరణ్, బన్నీ, ధరమ్, వరుణ్ వెండి తెరను ఏలుతుంటే..నందమూరి ఫ్యామిలీ నుండి ఎన్టీఆర్ ఒక్కడే మిగిలాడు.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.