’90 ఎం.ఎల్’ సినిమాకి మరో సమస్య వచ్చిపడింది..!

‘ప్రేమతో మీ కార్తీక్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు హీరో కార్తికేయ గుమ్మకొండ. అయితే అటు తరువాత ‘ఆర్.ఎక్స్.100’ స్థాయి హిట్ ను అందుకోలేకపోయాడనే చెప్పాలి. ‘హిప్పీ’ చిత్రం అట్టర్ ప్లాప్ కాగా ‘గుణ 369’ చిత్రం యావేరేజ్ ఫలితాన్ని మాత్రమే ఇచ్చింది. ‘నాని’స్ గ్యాంగ్ లీడర్’ చిత్రంలో విలన్ గా చేసినప్పటికీ.. ఆ చిత్రం కూడా హిట్ అవ్వలేదు. ఇప్పుడు ఎలాగైనా హిట్టందుకోవాలనే కసితో ’90.ఎం.ఎల్’ చిత్రం చేసాడు.

kartikeyas-90ml-movie-shooting-update

శేఖర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం ముందుగా డిసెంబర్ 5న విడుదల కావాల్సినప్పటికీ.. సెన్సార్ పనులు పూర్తికాకపోవడంతో డిసెంబర్ 6కి మార్చారు. అంతే బానే ఉంది అనుకుంటే.. ఈ చిత్రం విడుదలను అడ్డుకుంటాం అంటూ మద్యపాన నిషేధం పోరాట సమితి సభ్యులు ప్రకటించడం చిత్ర యూనిట్ సభ్యులని నిద్రలేకుండా చేస్తుందట. ‘ఇలాంటి సినిమాల వల్ల యువత తప్పుదోవ పడుతోందని.. మహిళలపై అత్యాచారాలకు పడేలా చేస్తున్నాయని వారు మండిపడ్డారు. ముఖ్యంగా ఈ సినిమాలో మద్యం సేవించే సన్నివేశాలను తొలగించాలని.. అలాగే టైటిల్ ను సైతం మార్చాలని డిమాండ్ చేసినప్పటికీ.. అవేవీ జరగకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు వారు చెప్పుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శితం కాకుండా శాంతియుతంగానే అడ్డుకుంటామని వారు చెబుతున్నారు. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.