సందీప్ రెడ్డి వంగా.. ట్వీట్ ఎయ్యడమే పాపమా..!

విజయ్ దేవరకొండ ను స్టార్ హీరోగా చేసింది కచ్చితంగా ‘అర్జున్ రెడ్డి’ చిత్రమనే చెప్పాలి. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా ‘గేమ్ చేంజెర్’ మూవీ అనే ప్రశంసలు కూడా అందుకుంది. అయితే ఇదే క్రమంలో కొందరు మహిళలు ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు మహిళల పై హింస రేకెత్తించేలా ఉన్నాయంటూ విమర్శలు కూడా వచ్చాయి. ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’ పేరుతో తెరకెక్కించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అక్కడ కూడా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే విమర్శలు కూడా మరింత పెరిగాయి. ఈ విమర్శలు ఇప్పటికీ తగ్గలేదు. ఇటీవల నటి పార్వతి కూడా విజయ్ దేవరకొండ ను ఈ విషయం పైనే ప్రశ్నించి విసిగించింది.

Sandeep Reddy Vanga Tweet

ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ యువ వైద్యురాలను కొంతమంది యువకులు అత్యాచారం చేసి ఆ తరువాత ఆమెను కిరోసిన్ పోసి దహనం చేసిన సంఘటన అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ సంఘటన చర్చనీయాంశం అయ్యింది. అనేకమంది సినీ సెలబ్రిటీలు ఈ సంఘటన పై స్పందించి మహిళలకు భద్రత కల్పించాలని.. దోషులను కఠినంగా శిక్షించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా… ”సమాజంలో ఇలాంటి దారుణ ఘటనలను ఆపాలంటే భయం ఒక్కటే మార్గం. దోషులను కఠినంగా శిక్షిస్తేనే.. ఇలాంటి ఆలోచనలు చేయడానికే వణుకు పుడుతుంది. దేశంలోని ప్రతీ అమ్మాయికీ భరోసా కల్పించాలి” అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై కొందరు నెటిజన్లతో సహా సెలబ్రిటీలు కూడా సందీప్ ను విమర్శిస్తూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. దర్శకుడు విక్రమాదిత్య.. ‘కబీర్ సింగ్’ లోని ఓ సన్నివేశాన్ని ఉద్దేశిస్తూ … ‘మీరు చెబుతున్న ఆ భయం.. మీ సినిమాలో ఆమె(హీరోయిన్)ని కొట్టకుండా ఆపగలిగిందా..?’ అంటూ సెటైర్ వేసాడు. దీనిని బట్టి చూస్తే.. ఇప్పట్లో సందీప్ రెడ్డి వంగా ను విడిచిపెట్టేలా లేరు అనేది స్పష్టమవుతుంది.

1

1Sandeep Reddy Vanga

2

2Sandeep Reddy Vanga

3

3Sandeep Reddy Vanga

4

5Sandeep Reddy Vanga

5

4Sandeep Reddy Vanga

6

6Sandeep Reddy Vanga

7

8Sandeep Reddy Vanga

 

7Sandeep Reddy Vanga

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.