సరిలేరు నీకెవ్వరులో ఐటెమ్ సాంగ్ కి హీరోయిన్ ఫిక్స్ అవ్వలేదు!

మహేష్ బాబు తాజా చిత్రమైన “సరిలేరు నీకెవ్వరు”లో ఐటెమ్ సాంగ్ కోసం తమన్నాను ఫైనల్ చేశారని వచ్చిన వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. “మహర్షి”తో మహేష్ బాబుతో కలిసి నటించిన పూజా హెగ్డేను ఆప్షన్ గా చూస్తున్నారట. ఆల్రెడీ మంచి సక్సెస్ సొంతం చేసుకొన్న ఈ జోడీ మరోసారి ఆన్ స్క్రీన్ జంటగా ఒక స్పెషల్ సాంగ్ లో కనిపిస్తే బాగుంటుంది అని భావిస్తున్నారు చిత్రబృందం. పూజా హెగ్డే కూడా ఆల్రెడీ “రంగస్థలం” చిత్రంలో జిగేల్ రాణిగా మెరిసింది కాబట్టి.. మహేష్ బాబు సినిమాలో స్పెషల్ సాంగ్ అంటే నో చెప్పే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. సో, అన్నీ సెట్ అయితే.. ఈ సంక్రాంతికి మహేష్-పూజా కాంబినేషన్ ను మరోసారి చూడొచ్చన్నమాట.

once-again-pooja-hegde-to-shake-a-leg-with-mahesh-babu1

ఇకపోతే.. ప్రస్తుతం హైద్రాబాద్ లో ఫాస్ట్ పేస్ లో కొత్త షెడ్యూల్ జరుపుకొంటున్న ఈ చిత్రం దాదాపు 70% పూర్తికావచ్చింది. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి కీలకపాత్ర పోషిస్తుండగా.. మహేష్ మొదటిసారిగా ఆర్మీ సోల్జర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా టీజర్ ను దసరా కానుకగా విడుదల చేసే అవకాశాలున్నాయి.

Share.