Trivikram: ఎన్టీఆర్ కు త్రివిక్రమ్ పూర్తిగా దూరమైనట్టేనా..?

స్టార్ హీరో పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ మూడు సినిమాలలో జల్సా సినిమా హిట్ ఫలితాన్ని అందుకుంటే అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు ఇండస్ట్రీ హిట్లు కావడంతో అజ్ఞాతవాసి సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్దాయి. అయితే అజ్ఞాతవాసి సినిమా రిజల్ట్ పవన్ కళ్యాణ్ అభిమానులను తీవ్రంగా నిరాశకు గురి చేసింది.

అయితే పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా పట్టాలెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్, హరిహర వీరమల్లు సినిమాలలో నటిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ రెండు సినిమాల తరువాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. గతేడాది అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తరువాత సినిమాను మహేష్ బాబుతో తెరకెక్కించనున్నారు. 2022 సమ్మర్ లో ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

ఈ సినిమా తరువాత పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా పట్టాలెక్కనుంది. త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోయే రోజుల్లో ఒక సినిమా తెరకెక్కనుందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోయే రోజుల్లో కూడా సినిమా తెరకెక్కడం కష్తమేనని తెలుస్తోంది. ఎన్టీఆర్ తో తెరకెక్కించాల్సిన సినిమా ఆగిపోవడంతో త్రివిక్రమ్ హర్ట్ అయ్యారని ఎన్టీఆర్ కు త్రివిక్రమ్ పూర్తిగా దూరమైనట్టేనని తెలుస్తోంది.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Share.