‘వాల్మీకి’ .. ‘గ్యాంగ్ లీడర్’ కు అడ్డు పడుతున్నాడా?

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఇది నానికి 24 వ చిత్రం. మొదట ఈ చిత్రాన్ని ఆగష్టు 30 న విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ ‘సాహో’ విడుదల తేదీ వాయిదా పడి అదే డేట్ కు రావడంతో ‘గ్యాంగ్ లీడర్’ ను సెప్టెంబర్ 13కు మార్చారు. కథ అంతంత మాత్రం ఉన్నా… తన మేజికల్ డైరెక్షన్ తో ఆకట్టుకునే దర్శకుడు విక్రమ్ కుమార్… ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో నాని రైటర్ గా ‘పెన్సిల్’ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే మరో 19 రోజులలో విడుదల పెట్టుకుని ఈ చిత్రం యూనిట్ ఎటువంటి ప్రమోషన్లు నిర్వహించకుండా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

once-again-nanis-gang-leader-movie-postponed1

‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మించిన ఈ చిత్రం టీజర్, మరియు పాటలకు మంచి స్పందన లభించింది. అసలు ‘గ్యాంగ్ లీడర్’ ప్రమోషన్లు ఎందుకు నిర్వహించడం లేదు అనేదాని పై ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇదిలా ఉంటే… ‘గ్యాంగ్ లీడర్’ మరో సారి వాయిదా పడిందనే వార్తలు కూడా వస్తున్నాయి. వరుణ్ తేజ్, హరీష్ శంకర్ ల ‘వాల్మీకి’ చిత్రం కూడా అదే రోజు (సెప్టెంబర్ 13న) విడుదల కాబోతుంది కాబట్టి… ఆ చిత్ర నిర్మాతలైన ’14 రీల్స్ ప్లస్’ వారు ‘గ్యాంగ్ లీడర్’ నిర్మాతల్ని కలిసి సినిమాని పోస్ట్ పోన్ చేసుకోమని కోరినట్టు సమాచారం.మరి ఈ వార్త ఎంతవరకూ నిజమో తెలియాల్సి ఉంది.

Share.