నానితో ఒన్స్ మోర్ అంటున్న నిన్ను కోరి డైరెక్టర్

నటించే రెండుమూడు సినిమాలతోపాటు నటించాల్సిన ఓ నాలుగు సినిమాలను ఎప్పుడూ రెడీగా పెట్టుకొనే నాని ఈమధ్య కాస్త స్పీడ్ తగ్గించాడు. ప్రస్తుతం తనను కథానాయకుడిగా పరిచయం చేసిన మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో “వి” అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇది నాని 25వ సినిమా కావడం విశేషం. అయితే.. ఈ సినిమా తర్వాత నాని నెక్స్ట్ ప్రొజెక్ట్ ఏమిటి అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. రాహుల్ రవీంద్రన్ మరియు కొందరు కొత్త దర్శకుల పేర్లు వినిపించినప్పటికీ.. వాళ్ళతో సినిమా లేదని క్లారిటీ వచ్చేసింది.

once-again-nani-with-ninnu-kori-movie-director1

అయితే.. తాజా సమాచారం ప్రకారం నానికి “నిన్ను కోరి” చిత్రంతో ఎమోషనల్ హిట్ ఇచ్చిన శివ నిర్వాణకు నాని మరో అవకాశం ఇచ్చాడని తెలుస్తోంది. “నిన్ను కోరి” అనంతరం “మజిలీ”తో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్న శివ నిర్వాణ.. మళ్ళీ నానితో సినిమా చేస్తే గనుక తప్పకుండా క్రేజీ కాంబినేషన్ గా మారుతుంది. 2020 కోసం ఈ సినిమా ఒకే చేశాడని, శివ ఆల్రెడీ ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా మొదలెట్టేశాడని సమాచారం.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Share.