పవన్ ఫ్యాన్స్ కు అసలైన ఫీస్ట్ ఇచ్చేది హరీషే..!

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు.ఇప్పటికే వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ‘వకీల్ సాబ్’ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ చిత్రానికి ఇది రీమేక్..! దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఇక ఈ చిత్రం చేస్తూనే మరోపక్క క్రిష్ డైరెక్షన్లో కూడా ఓ చిత్రం చేస్తున్నాడు.

అయితే ఈ రెండు చిత్రాల్లో ఫ్యాన్స్ కు కావాల్సిన స్టఫ్ పెద్దగా ఉండదని సమాచారం. పవన్ ఫ్యాన్స్ కు కావాల్సిన ఫీస్ట్ ఇచ్చేది దర్శకుడు హరీష్ శంకరేనట. ‘గబ్బర్ సింగ్’ తర్వాత ఇన్నాళ్ళకి వీరిద్దరి కాంబినేషన్ సెట్ అయ్యింది.’మైత్రి మూవీ మేకర్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు ప్రకటించారు.ఇక ఈ చిత్రంలో పవన్ ఫ్యాన్స్ కు కావాల్సిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా ..దర్శకుడు హరీష్ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడట.

once again Harish Shankar scripting one liners for Pawan Kalyan1

ముఖ్యంగా వన్ లైనర్స్ ఓ రేంజ్ లో పేలబోతున్నాయని టాక్ వినిపిస్తుంది. ‘గబ్బర్ సింగ్’ లో… ‘నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది’….. ‘సాంబ రాసుకోరా’ వంటి డైలాగ్ లు బాగా పేలాయి.ఈసారి కూడా అదే ఫార్ములా అప్లై చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ ఏడాది ద్వితీయార్ధం నుండీ షూటింగ్ మొదలు పెట్టాలని ప్లాన్ చేసారు కానీ ఇప్పుడున్న పరిస్ధితుల్లో అది వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి..!

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Share.