అప్పుడెప్పుడో అన్నారు.. మళ్లీ ఇప్పుడంటున్నారు

ఒక సినిమా హిట్‌ అయ్యాక ఆ డైరెక్టర్‌ కొత్త సినిమా ఇదే అంటూ వార్తలు రావడం సహజమే. అందులో మాస్‌ డైరక్టర్‌ సినిమా హిట్‌ అయితే అవి ఇంకా ఎక్కువగా ఉంటాయి. పెద్ద హీరోలతో సినిమాలు ఓకే అవుతున్నాయట అని కూడా అంటుంటారు. ఇప్పుడలాంటి పరిస్థితి సంక్రాంతి సినిమా ‘క్రాక్‌’ డైరెక్టర్‌ మలినేని గోపీచంద్‌కు వచ్చింది. ఆ సినిమా అందుకు విజయంతో నిర్మాతలు వరుస కడుతున్నారట. అయితే గోపీ ఇంకా ఏ సినిమా కూడా ఫైనల్‌ చేయలేదు. దీంతో ఆ సినిమా, ఈ సినిమా అంటూ వార్తలొస్తున్నాయి. అందులో ఓ సినిమా గురించి బలంగా వార్తలొస్తున్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్‌ – నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందని చాలా రోజుల క్రితం నుంచి వార్తలొస్తున్నాయి. అయితే సరైన కథ, దర్శకుడు దొరక్క ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. అయితే ఇప్పుడు రెండూ కుదిరాయని తెలుస్తోంది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలయ్య తర్వాతి సినిమా అని వార్తలొస్తున్నాయి. దీని కోసం మైత్రీ మూవీ మేకర్స్‌ రెడీ అవుతోందట. యాక్షన్‌ ప్రధానంగా ఓ మాస్‌ మసాలా కథ గోపీచంద్‌ దగ్గర ఉందట. దానిని బాలయ్యకు చెప్పి ఓకే చేయించుకోవడమే బ్యాలెన్స్‌.

గోపీచంద్ మలినేని – బాలకృష్ణ నందమూరి మధ్య గతంలోనూ సినిమా చర్చలు జరిగాయి. అయితే అప్పుడు సినిమా మెటీరియలైజ్‌ కాలేదు. ఆ తర్వాత మళ్లీ ఆ ఊసులు వినిపిచంలేదు. గోపీచంద్‌కు సరైన విజయాలు లేకపోవడమూ ఓ కారణంగా చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు విజయం దక్కడంతో బాలయ్య సినిమా ఓకే అయ్యిందని అంటున్నారు. బోయపాటి సినిమాను పూర్తి చేసుకొని బాలయ్య గోపీచంద్‌ సినిమాకు వస్తాడట.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.