‘బిగ్ బాస్’ పునర్నవి ‘ఒక చిన్న విరామం’ ట్రైలర్ రివ్యూ..!

‘బిగ్ బాస్3’ లో లేడీ మోనార్క్ లా ఉంటూ రాహుల్ తో గొడవ పడుతూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది పునర్నవి. అంతక ముందు ‘ఉయ్యాలా జంపాలా’ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు వంటి’ సినిమాల్లో నటించినప్పటికీ ‘బిగ్ బాస్3’ తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె నటించిన ‘ఒక చిన్న విరామం’ అనే చిత్రం త్వరలోనే విడుదల కాబోతుంది. సందీప్ చేగూరి డైరెక్షన్లో వైవిధ్యభరితమైన కథాకథనాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో పునర్నవితో పాటు సంజయ్ వర్మ .. .. నవీన్ .. గరిమా సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. ‘మూన్ వాక్ ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Oka Chinna Viramam Movie Trailer Review1

తాజాగా ఈ చిత్రం నుండీ ట్రైలర్ ను విడుదల చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కినట్టు ట్రైలర్ చెబుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. భరత్ మంచిరాజు నేపధ్య సంగీతం ఆకట్టుకునే విధంగా ఉంది.’ బిగ్ బాస్ 3′ పునర్నవి నటన కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. మరి ఈ చిత్రం ఆమె కెరీర్ కు ఎలా ఉపయోగపడుతుందో చూడాలి..!


మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.