‘ఓ పిట్టకథ’ టీజర్ రివ్యూ..!

ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు బ్రహ్మాజీ. ఈయన హీరోగా కూడా సినిమాలు చేసాడు. ఇదిలా ఉండగా బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు ని హీరోగా పరిచయం చేస్తూ ‘ఓ పిట్టకథ’ అనే చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ‘భవ్య క్రియేషన్స్’ బ్యానర్ పై వి.ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. చెందు ముద్దు అనే కొత్త కుర్రాడు ఈ చిత్రం ద్వారా డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. నిత్యా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం టీజర్ కొద్ది సేపటి క్రితం విడుదలయ్యింది.

O Pitta Katha Movie Teaser Review1

సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోషల్ మీడియా ద్వారా ‘ఓ పిట్టకథ’ టీజర్ ను విడుదల చేసాడు. హీరో సంజయ్ కు బెస్ట్ విషెస్ కూడా చెప్పాడు మహేష్ బాబు. ఈ చిత్రం టీజర్ చాలా సింపుల్ గా ఆకట్టుకునేవిధంగా ఉంది. ఇద్దరబ్బాయిలు కలిసి ఓ అమ్మాయిని ప్రేమిస్తారు… అనుకోకుండా ఆ అమ్మాయి కిడ్నాప్ కు గురవుతుంది. ఈ ఇద్దరిలో ఎవరు ఆమెను కాపాడతారు. ఆ అమ్మాయి చివరికి ఎవరిని పెళ్ళిచేసుకుంటుంది అనేది కథని టీజర్ చూస్తే స్పష్టమవుతుంది. ఓవరాల్ గా టీజర్ ఓకే అనిపిస్తుంది. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.


జాను సినిమా రివ్యూ & రేటింగ్!
అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు

Share.