నందమూరి ఫ్యామిలీ నుండీ 3వ ప్రొడక్షన్ హౌస్..ఆ పేరు ఫిక్స్..!

నందమూరి ఫ్యామిలీ నుండీ ఇప్పటికే రెండు ప్రొడక్షన్ హౌస్ లు.. అదే నిర్మాణ సంస్థలు మొదలయ్యాయి. హరికృష్ణ కుమారుడు జానకి జానకి రామ్ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ ను స్థాపించగా… ఇప్పుడు దానిని కళ్యాణ్ రామ్ నడిపిస్తున్నాడు.’అతనొక్కడే’ ‘పటాస్’ ‘జై లవ కుశ’ వంటి విజయవంతమైన సినిమాలు ఆ బ్యానర్ నుండీ వచ్చాయి. ఇప్పుడు ఎన్టీఆర్ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం కూడా ఇదే బ్యానర్ లో రూపొందనుంది.

ఇక నందమూరి బాలకృష్ణ సైతం ‘ఎన్. బి.కె ఫిలిమ్స్’ అనే బ్యానర్ ను స్థాపించి ‘ఎన్టీఆర్ బయోపిక్ ‘ కోవలో ‘ఎన్టీఆర్ కధానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ వంటి చిత్రాలను తెరకెక్కించాడు. అయితే అవి డిజాస్టర్లు కావడంతో బాలయ్యకు తీవ్ర నష్టాలు వచ్చాయి. ఇక మళ్ళీ నిర్మాణం వైపు చూడలేదు.ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ నుండీ 3 వ బ్యానర్ ను లాంచ్ చేయబోతున్నాడు ఎన్టీఆర్. గత కొద్ది రోజులుగా దీని పై వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

19-Jr NTR

‘ నందమూరి హరికృష్ణ ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ లేదా ‘భార్గవ్ హరి ప్రొడక్షన్స్’ వంటి రెండు పేర్ల పై ఎన్టీఆర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. దాదాపు ఈ రెండిటిలో ఒకటి ఫైనల్ అవ్వడం ఖాయం అని తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ …’ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. ‘రౌద్రం రణం రుధిరం’ అనేది ఫుల్ టైటిల్ అంటూ నిన్న ఓ మోషన్ పోస్టర్ ను టీం విడుదల చేసిన సంగతి తెలిసిందే..!

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Share.