‘ఆర్.ఆర్.ఆర్’ లో ఎన్టీఆర్ కు రొమాంటిక్ సీన్లు ఎక్కువ ఉంటాయట..!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఎన్టీఆర్ .. చరణ్ లకు కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా రాజమౌళి పరుగులు పెట్టిస్తున్నాడట. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయ్యిందని ప్రకటించారు. కాబట్టి అనుకున్న టైంకే సినిమా విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు స్పష్టమవుతుంది. 2020 జూలై 30 న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ఇదివరకే ఓ మీటింగ్ పెట్టి దర్శక నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

is-there-any-update-on-aug15th-from-rrr-movie1

ఇక కొమరం భీమ్ గా ఎన్టీఆర్ .. అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్న ఈ చిత్రంలో… ఆలియా భట్.. చరణ్ కు జోడీగా నటిస్తుంది. ఇటీవల ఈమెకు సంబందించిన ఓ పోర్షన్ పూర్తయ్యిందట. ఈమె కనిపించేది కేవలం 15 నిమిషాలు మాత్రమేనని టాక్. అయితే హీరోయిన్స్ తో ఎన్టీఆర్ కు మాత్రం ఎక్కువ రొమాంటిక్ సీన్స్ ఉండబోతున్నాయని తెలుస్తుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆ సన్నివేశాలకు సంబందించిన షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.