ఎన్టీఆర్ సాంగ్ కి జపనీస్ డాన్సర్స్ ఎనర్జిటిక్ స్టెప్స్

భారతీయ చిత్రాలకు ప్రపంచ దేశాలలో ఆదరణ తక్కువే. ఇక హీరోలకు ఫ్యాన్స్ అంటే కష్టం అనే మాట వినిపించేది. కొన్నాళ్లుగా ఆ సమీకరణాలు మారాయి. జపాన్, సింగపూర్, అమెరికా, ఆస్ట్రేలియా, చైనా వంటి దేశాలలో ఇండియన్ మూవీస్ ఆదరణ దక్కించుకుంటున్నాయి. జపాన్ లో రజిని కాంత్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. అక్కడ ఆయన సినిమాలు విడుదలై మంచి ఆదరణ దక్కించుకున్నాయి. ఆ తరువాత ఎన్టీఆర్ కి జపాన్ లో ఫ్యాన్స్ ఏర్పడ్డారు.

బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ కి జపాన్ లో ఫ్యాన్ బేస్ ఏర్పడింది. తాజాగా జపనీస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్బుత వీడియో చేశారు. 2006లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అశోక్ అనే మూవీ వచ్చింది. ఆ మూవీలో ఎన్టీఆర్ కి జంటగా సమీరా రెడ్డి నటించారు. కాగా ఈ మూవీలోని గోలా గోలా సాంగ్ కి జపనీస్ జంట స్టెప్స్ వేసి ఇరగదీశారు. ముఖ్యంగా కాస్ట్యూమ్స్ తో సహా స్టెప్స్ చాల దగ్గరగా అనుకరించారు. ఎన్టీఆర్ ఎనర్జీకి తగ్గ కుండా ఈ జంట గోలా గోలా సాంగ్ లో అద్భుతమైన స్టెప్స్ వేసి ఆకట్టుకున్నారు.

ఆ వీడియో ఇప్పుడు సోషల్ మాధ్యమాలలో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ వీడియోపై లైక్స్ మరియు షేర్స్ తో విరుచుకుపడుతున్నారు. జపాన్ లో ఎన్టీఆర్ కి మంచి ఫాలోయింగ్ ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక ఎన్టీఆర్ త్వరలో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో జాయిన్ కావాల్సి వుంది.


భానుమతి & రామకృష్ణ సినిమా రివ్యూ & రేటింగ్!
సినిమాల్లోకి రాకముందు మన హీరోయిన్స్ ఎలా ఉంటారో చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!
అట్టర్ ఫ్లాప్ సీజన్ అంటే ఇదేనేమో..!

Share.