Jr NTR: ఎన్టీఆర్ ఎప్పుడు నోరు విప్పుతారో?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఅర్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో ఇప్పటికే జనతా గ్యారేజ్ సినిమాలో నటించగా ఈ కాంబినేషన్ లో మరో సినిమా షూటింగ్ త్వరలో మొదలు కానుంది. ఆగష్టులో ఆర్ఆర్ఆర్ పూర్తైన వెంటనే ఎన్టీఆర్ కొరటాల శివ ప్రాజెక్ట్ తో బిజీ కానుండగా వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా రిలీజవుతుందని ఇప్పటికే ప్రకటన వెలువడింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ కు సంబంధించిన అప్ డేట్ మాత్రం రాలేదు.

చరణ్ శంకర్ కాంబో మూవీలో ఒక సినిమా తెరకెక్కనుండగా ఈరోజు ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నట్టు ప్రకటన వెలువడింది. కొన్ని నెలల క్రితం కియారా సౌత్ ఇండియాలో భారీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని చెప్పగా ఆ మూవీ చరణ్ శంకర్ కాంబో అని తేలింది. తారక్ తరువాత సినిమాలో కూడా కియారా హీరోయిన్ అని వార్తలు వచ్చినా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

చరణ్ నటిస్తున్న చిత్రయూనిట్ నుంచి హీరోయిన్ గురించి స్పష్టత రాగా ఎన్టీఆర్ మూవీ నుంచి స్పష్టత ఎప్పుడు వస్తుందో చూడాల్సి ఉంది. కొరటాల శివ ఆచార్య సినిమాలో మరో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్నట్టు ఆలస్యంగా వెల్లడించారు. ఎన్టీఆర్, కొరటాల శివ తరువాత సినిమా హీరోయిన్ గురించి ఎప్పుడు రివీల్ చేస్తారో చూడాల్సి ఉంది. ఆచార్య షూటింగ్ పూర్తైన వెంటనే కొరటాల శివ ఎన్టీఆర్ సినిమా పనులను మొదలుపెట్టనున్నారు.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Share.