రౌడీ బేబీకి ఏడాది గ్యాప్ తప్పేట్లు లేదు

2020 సంవత్సరం అందరి సరదా తీర్చేసింది. ముఖ్యంగా సినిమా తారాలకి ఈ ఏడాది బ్యాడ్ అనే చెప్పాలి. ఎన్ని కోట్లు సంపాదించి, ఎంతమంది అభిమానులు ఉన్నా కనీసం ఏడాదికి రెండుమూడు సినిమాలు చేయకపోతే వాళ్ళకి కూడా గడ్డు కాలమే. అయితే.. కమర్షియల్ గా కాదు కానీ.. ప్రొఫెషనల్ గా మాత్రం సాయిపల్లవికి పెద్ద దెబ్బ పడింది. 2017లో “ఫిదా” సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన సాయిపల్లవి అనంతరం “మిడిల్ క్లాస్ అబ్బాయి”తో సూపర్ హిట్ కొట్టి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్ లో సక్సెస్ ఫుల్ గా చేరిపోయింది.

అయితే.. ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడం మొదలైంది. “కణం, పడి పడి లేచే మనసు, మారి 2, అతిరన్ (మలయాళం), ఎన్ జి కె” ఇలా ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడంతో.. జనాల్లో ఆమెకున్న క్రేజ్ తగ్గకపోయిన ప్రొడ్యూసర్స్ అప్రోచ్ మాత్రం తగ్గింది. అయితే.. ముందు నుంచీ క్వాంటిటీ కంటే క్వాలిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన సాయిపల్లవి ఆఫర్లు తగ్గడాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తనకు సౌత్ లో లైఫ్ ఇచ్చిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “లవ్ స్టోరీ” సినిమా సైన్ చేసింది. నాగచైతన్య హీరోగా తెరక్కుతున్న ఈ చిత్రం నిజానికి గతేడాదే విడుదల చేయాలని ప్లాన్ చేశారు కానీ..

Sai Pallavi opens up about her marriage1

షూటింగ్ అనుకున్న ప్రకారం జరగకపోవడంతో 2020 జూలైలో విడుదల చేద్దామనుకున్నారు. కానీ.. ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే ఈ ఏడాది విడుదలయ్యే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. పోనీ ఒటీటీ రిలీజ్ అయినా చేద్దామా అంటే.. షూటింగ్ ఇంకా పూర్తవ్వకపోవడంతో అదీ లేకుండాపోయింది. సో, 2020లో హిట్ కొడదామన్న సాయిపల్లవి ప్లాన్ బెడిసికొట్టిందన్నమాట.

Most Recommended Video

15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Share.