దిల్ రాజు సినిమాకి ప్రమోషన్స్ లేవేంటబ్బా..!

దిల్ రాజు సినిమా అంటే ఉండే క్రేజే వేరు. ఆయన నిర్మించే ప్రతీ సినిమా మినిమం గ్యారెంటీ కాబట్టి.. ఒకవేళ సినిమాలో విషయం అంతంత మాత్రం ఉన్నా.. ప్రమోషన్స్ కు మాత్రం లోటు చెయ్యడు. సినిమా రిలీజ్ కి 45రోజుల నుండీ.. టైటిల్ జనాల నోట్లో మారుమోగేలా చేస్తుంటాడు. అది చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా.. రాజు గారు అస్సలు తగ్గడు. అలాంటిది ఆయన నిర్మాణంలో వస్తోన్న ‘షాదీ ముబారక్’ అనే చిత్రం చాలా సైలెంట్ గా ఈ మార్చి 5న విడుదల కాబోతుంది.

ఇందులో భాగంగా ఈరోజు ఈ చిత్రం టీజర్ ను విడుదల చేశారు. ఇది చూస్తుంటే.. బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం గ్యారెంటీ అనిపిస్తుంది. అందరినీ ఆకట్టుకునే విధంగానే ఈ టీజర్ ఉంది. బహుశా ఇంటిపేరు థీమ్ తో ఈ చిత్రం కథ ఉంటుంది కాబట్టి.. ఏమైనా కాంట్రావర్సీ ఏమైనా ఏర్పడుతుందని దిల్ రాజు భయపడుతున్నారా అనే డిస్కషన్లు కూడా నడుస్తున్నాయి. ఇక ఈ చిత్రం విషయానికి వస్తే.. ‘మొగలిరేకులు’ సీరియల్ ద్వారా బోలెడంత క్రేజ్ ను సంపాదించుకున్న నటుడు సాగర్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

అతని మేకోవర్ కొత్తగా.. ఇప్పటి ట్రెండ్ ను ఆకట్టుకునే విధంగానే ఉంది. ఇక హీరోయిన్ దృశ్య ర‌ఘునాథ్‌ నటన పరంగా ఎట్రాక్ట్ చేస్తుందనే ఆశలు రేకెత్తిస్తుంది. సునీల్ కశ్య‌ప్ అంధించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా టీజర్ కు హైలెట్ గా నిలిచింది అని చెప్పొచ్చు. టీజర్ అయితే ఆకట్టుకునే విధంగా ఉంది. మీరు కూడా ఓ లుక్కెయ్యండి :


ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Share.