అఖిల్ రికార్డుని ఇప్పటికీ ఎవ్వరూ బ్రేక్ చెయ్యలేదు…!

అఖిల్ అక్కినేని … అక్కినేని మూడో తరం హీరో. నాగార్జున రెండో కొడుకు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఐదేళ్లు పూర్తికావస్తున్నా ఇంకా సారైన హిట్ అందుకోలేదు. ఈ విషయం పై చాలా మంది అఖిల్ ను ట్రోల్ చేస్తూ ఉంటారు. అయితే అఖిల్ … డ్యాన్స్ లు ఫైట్ లు ఇరగదీస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకూ అఖిల్ చేసిన మూడు చిత్రాల్లో ‘హలో’ కు మంచి టాక్ వచ్చింది. అది కమర్షియల్ ఫెయిల్యూర్ మాత్రమే. ఇప్పటికీ ఆ చిత్రానికి ఫ్యాన్స్ ఉన్నారు అనడంలో అతిసయోక్తి లేదు. ప్రస్తుతం అఖిల్ … బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో తన నాలుగవ చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ చిత్రం చేస్తున్నాడు.

‘జిఏ2 పిక్చర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. పూజా హెగ్దే హీరోయిన్ కాగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. నాలుగవ చిత్రంతో తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరోలు చాలా మంది ఉన్నారు. నాగార్జున ‘మజ్ను’, పవన్ కళ్యాణ్ ‘తొలి ప్రేమ’, మహేష్ బాబు ‘మురారి’ , ఎన్టీఆర్ ‘ఆది’ వంటి వారి కెరీర్ లో అవి నాలుగవ చిత్రాలు. అవి సూపర్ హిట్ కావడంతో వారి ఇమేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు అఖిల్ విషయంలో కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమో చూడాలి. ఇది పక్కన పెడితే… ఓ విషయంలో మాత్రం అఖిల్ హీరోగా ఎంట్రీ ఇవ్వడమే సరికొత్త రికార్డు క్రియేట్ చేసాడు. ఇప్పటికీ ఆ రికార్డు అఖిల్ పేరు మీదే ఉంది.

14-Akhil Akkineni

అదేంటంటే డెబ్యూ హీరోల్లో మొదటి చిత్రంతో .. అదీ మొదటి రోజు ఎక్కువ కలెక్షన్లు నమోదు చేసిన హీరో అఖిలే. అది కూడా నవంబర్ వంటి అన్ సీజన్లో కావడం విశేషం. 2015 నవంబర్ 11 న విడుదలైన అఖిల్ చిత్రం మొదటి రోజు ఏకంగా 7.59 కోట్ల షేర్ ను రాబట్టింది. సాదారణంగా దీపావళి రోజున సినిమాలకి ప్రేక్షకులు ఎక్కువ వెళ్ళరు .. అయినప్పటికీ అఖిల్ చిత్రం రికార్డు ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఇప్పటికీ ఆ రికార్డు అఖిల్ పేరు మీదే ఉంది. వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రాన్ని హీరో నితిన్ నిర్మించాడు. ఇక ఈరోజు అఖిల్ పుట్టినరోజు కావడంతో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ చిత్రానికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఇస్తారేమో చూడాలి..!

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Share.