షాలిని పాండే కి అవకాశాలు అందుకే రావడం లేదు..!

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘అర్జున్ రెడ్డి’ తో హీరోయిన్ గా పరిచయమైంది షాలినీ పాండే. ఈ చిత్రంలో తన నటనతో యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. మొదటి చిత్రంతోనే ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అందుకుంది కాబట్టి ఈ బ్యూటీకి అవకాశాలు ఓ రేంజ్లో వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఆ రేంజ్లో ఆమెకు అవకాశాలు రాలేదు. కోలీవుడ్ లో కూడా సినిమా చేసి మెప్పించిన ఎందుకో అక్కడ కూడా ఈమెకు ఆఫర్లు రావడం లేదు. చూడటానికి అందంగా.. ఆకర్షించే విధంగా… అలాగే నటనతో ఆకర్షించే విధంగా ఉండే ఈ బ్యూటీకి ఆఫర్లు ఎందుకు రావడం లేదు అనేది చర్చనీయాంశం అయ్యింది.

no-offers-for-actress-shalini-pandey1

దీని వెనుక అసలు కారణం.. షాలినీ ఆటిట్యూడే కారణం అని ఫిలింనగర్లో టాక్ వినిపిస్తుంది. ‘నా పాత్ర సమయం ఎక్కువ ఉండాలి.. తక్కువ ఉంటే చేయను. అలాగే అడిగినంత రెమ్యూనరేషన్ ఇస్తేనే… సినిమాకి డేట్స్ ఇస్తాను” అంటూ దర్శక నిర్మాతలకు తెగేసి చెప్పేస్తుందట. ఈమె తీరు వారికి నచ్చకపోవడం వల్లే.. అవకాశాలు ఇవ్వడం లేదని సమాచారం.

Share.