బన్నీతో స్పీడ్ పెంచిన సుక్కూ..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పీడ్ పెంచాడు. కోవిడ్ లాక్డౌన్ తర్వాత అందరికంటే స్లోగా షూటింగ్ స్టార్ట్ చేసినా కూడా అందరికంటే ముందు షెడ్యూల్స్ ని ఫినిష్ చేస్తున్నాడు. నిన్నటివరకు హైదరాబాద్‌, మారేడుమిల్లిలోని అటవీప్రాంతాల్లో షూటింగ్‌ జరిపిన పుష్ప చిత్రయూనిట్‌ ఇప్పుడు లోకేషన్‌ ఛేంజ్‌ చేస్తోంది. మోతుగూడెంలోని పొల్లూరు వాటర్‌ ఫాల్స్ లో షూటింగ్‌ జరపాలని డిసైడ్‌ అయ్యారు. అయితే ఇప్పటివరకు అధికారుల నుంచి పర్మిషన్‌ రాలేదు. ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఎప్పుడు పర్మీషన్ ఇస్తే అప్పుడు రెడీ ..రెడీ.. అంటోంది మూవీ టీమ్.

అంతేకాదు, బన్నీతో ఈసినిమాని చాలా స్పీడ్ గా కంప్లీట్ చేయాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. సమ్మర్ లో సినిమాని ప్రేక్షకులముందు ఉంచేందుకు ట్రై చేస్తున్నాడట. అందుకే, షూటింగ్ షెడ్యూల్స్ ని కూడా గ్యాప్ లేకుండా ప్లాన్ చేసినట్లుగా సమాచారం తెలుస్తోంది. ఇప్పటి వరకూ పుష్పరాజ్ కి విలన్ ఎవరు అన్నది ఇంకా డిసైడ్ చేయలేదు. ఇప్పుడు సినిమాలో వర్క్ చేస్తున్న కాస్టింగ్ ని రివిల్ చేస్తూ వాళ్లకి సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం.

Allu Arjun With Sukumar

సంక్రాంతి పండక్కి పుష్ప నుంచి ఎలాంటి అప్ డేట్ వస్తుందా అని బన్నీ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి అదీ విషయం.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Share.