ప్రస్థానం అక్కడ హిట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు

“వెన్నెల” లాంటి కామెడీ సినిమాతో దర్శకుడిగా పరిచయమై తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకొన్న దర్శకుడు దేవా కట్ట. అనంతరం “ప్రస్థానం, ఆటోనగర్ సూర్య” సినిమాలతో తాను కామెడీ సినిమాలకంటే సీరియస్ సినిమాలను బాగా తీయగలను అని నిరూపించుకొన్నాడు. అయితే.. “ఆటోనగర్ సూర్య” విడుదలవ్వడంలో జరిగిన ఆలస్యం.. అనంతరం ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన “డైనమైట్” డిజాస్టర్ గా నిలవడంతో అప్పట్నుంచి దేవా కట్టకు తెలుగులో మరో అవకాశం లభించలేదు. అయితే.. దేవ కట్ట దర్శకత్వ ప్రతిభ మీద మంచి నమ్మకం ఉన్న రాజమౌళి మాత్రం “బాహుబలి” అమేజాన్ సిరీస్ ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని దేవా కట్టకు ఇచ్చాడు. ఈలోపు దేవా కూడా బాలీవుడ్ లో తన ప్రస్థానం సినిమాను రీమేక్ చేశాడనుకోండి.

no-hype-on-deva-kattas-prassthanam-movie1

అయితే.. హిందీ ప్రస్థానం ట్రైలర్ కానీ.. క్యాస్టింగ్ కానీ ఆస్తికరంగా లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్ గా మారింది. ఇన్నేళ్ల తర్వాత ఎలాంటి మార్పులు చేయకుండా సినిమాను అచ్చుగుద్దినట్లు తెలుగు వెర్షన్ లాగే హిందీ వెర్షన్ ను కూడా తీయడం. సంజయ్ దత్ తప్పితే మరో ఆర్టిస్ట్ ఎవరూ పెద్దగా తెలియకపోవడం వల్ల సినిమాకి పెద్దగా బుకింగ్స్ లేవు. ఇదే తీరుగా రేపు రివ్యూలు కూడా వస్తే సినిమా ఫ్లాప్ అవ్వడంలో ఎలాంటి సందేహం లేదు.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Share.