చాన్నాళ్ళకు పబ్లిక్ ఈవెంట్ లో కనిపించిన అనుష్క

అందాల భామ అనుష్క పబ్లిక్ గా కనిపించి చాలా నెలలవుతోంది. ఎయిర్ పోర్ట్ నుండి వచ్చే సెలబ్రిటీ ఫోటోల్లో అప్పుడప్పుడు కనిపించే అనుష్క.. ఈమధ్యకాలంలో సినిమా ఈవెంట్లకు రావడం కూడా మానేసింది. అయితే.. నిన్న జరిగిన “హిట్” ప్రీరిలీజ్ ఈవెంట్ కు మాత్రం హాజరైంది అనుష్క. రాజమౌళి, కీరవాణి, అనుష్క, రాణాలు ముఖ్య అతిధులుగా విచ్చేసిన “హిట్” ప్రీరిలీజ్ ఈవెంట్ మంచి ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో చీఫ్ గెస్ట్ ల స్పీచ్ ల కంటే ఎక్కువగా అందర్నీ ఆకర్షించిన విషయం.. అనుష్క లుక్. ఎప్పట్లానే నిండైన వస్త్రధారణతో ఈవెంట్ కు హాజరైన అనుష్క.. తన క్యూట్ స్పీచ్ తోనూ అలరించింది.

అయితే.. అనుష్క ఫేస్ వరకూ క్యూట్ గానే ఉన్నప్పటికీ, బాడీ పరంగా మాత్రం పెద్దగా మార్పులేమీ రాలేదని అర్ధమవుతోంది. సైజ్ జీరో సినిమా కోసం పెరిగిన అధిక బరువును తగ్గించుకోవడం కోసం అనుష్క అప్పట్నుంది పాట్లు పడుతున్న విషయం తెలిసిందే. మధ్యలో ఆస్ట్రేలియా వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఆమె శరీరంలో పెద్దగా మార్పులేమీ రాలేదు. దాంతో అనుష్క మళ్ళీ తన పాత షేపుకు రావడం కష్టమేనని ఆమె అభిమానులు కూడా ఫిక్స్ అయిపోయారు. ఆ “సైజ్ జీరో” సినిమా చేయకపోయినా బాగుండేదని స్వీటీ ఫ్యాన్స్ ఇప్పుడు బాధపడుతున్నారు.

Most Recommended Video

1

2

3

4

5


Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.