బాలకృష్ణ ‘రూలర్’ కు నో బయ్యర్స్..!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 105 వ చిత్రం ‘రూలర్’. కె.ఎస్.రవి కుమార్ డైరెక్షన్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘రూలర్’ చిత్రం వచ్చింది. అప్పుడు ఏదో పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమా డిజాస్టర్ అయ్యింది కాబట్టి ఆప్షన్ లేక ఈ సినిమా చూసారు ప్రేక్షకులు. దీంతో బయ్యర్స్ అంతా సేఫ్ అయిపోయారు. అలా ఆ చిత్రం హిట్ లిస్ట్ లో చేరడం జరిగింది. అదే ధైర్యంతో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రాన్ని 2019 సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. ఈ చిత్రం అమ్మిన రేట్లలో కనీసం 50 శాతం కూడా వెనక్కి రాబట్టలేకపోయింది. తరువాత వచ్చిన ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమా పరిస్థితి అంతకన్నా దారుణం.

Balakrishna's Ruler Movie Shoot Wrapped Up

దీంతో ఇప్పుడు ‘రూలర్’ సినిమాని కొనడానికి బయ్యర్లు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తుంది. పైగా అటు ‘వెంకీమామ’.. ఇటు సాయితేజ్ ‘ప్రతీరోజు పండగే’ వంటి క్రేజీ సినిమాల మధ్యలో వస్తుండడంతో.. ఈ సినిమాని ఎవ్వరూ పట్టించుకోవట్లేదని స్పష్టమవుతుంది. పైగా ఇటీవల విడుదల చేసిన టీజర్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోగా.. బాలయ్య లుక్ పై కూడా ట్రోలింగ్ జరిగింది. దీంతో చాలావరకూ సినిమాని ఓన్ రిలీజ్ చేసుకోవాలని భావిస్తున్నారట నిర్మాతలు. ఇక ఓవర్సీస్ పరిస్థితి మరింత ఘోరంగా ఉందని సమాచారం. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో కూడా ఈ చిత్రం పెట్టిన పెట్టుబడిలో సగంకూడా వెనక్కితెచ్చే పరిస్థితి లేదట. సినిమా విడుదలయ్యి హిట్ టాక్ వస్తే తప్ప… పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చే ఛాన్స్ లేదని చిత్ర నిర్మాతలు కలవర పడుతున్నట్టు ఇన్సైడ్ టాక్. మరి ఈ వార్తలో ఎంతవరకూ నిజముందో తెలియాల్సి ఉంది.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.