‘కొమరం పులి’ హీరోయిన్ పై పవన్ ఫ్యాన్స్ ట్రోలింగ్.. కారణం అదే?

సెప్టంబర్ 2న వినాయక చవితితో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు కూడా ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. పవన్ పుట్టినరోజున ఆయన అభిమానులు వినాయక చవితికి మించిన పండుగే చేసుకున్నారు. సోషల్ మీడియాలో అయితే వాళ్ళ హడావిడి అంతా ఇంతా కాదు. మిలియన్ల కొద్దీ ట్వీట్స్ తో విషెస్ చెప్పి పవన్ పేరు ఇండియాలో టాప్ 1 ట్రెండింగ్ గా నిలిచేలా చేశారు. కేవలం అభిమానులే కాదు కొందరు సెలబ్రిటీలు సైతం పవన్ భజన చేస్తూ వరుసగా ట్వీట్లు చేసి తమ సినిమాల ఫస్ట్ లుక్స్ ను కూడా విడుదల చేశారు. ఇక పవన్ తో కలిసి పని చేసిన హీరోయిన్లు సైతం ఆయనకు విషెస్ చెబుతూ ట్వీట్స్ చేశారు.

nikesha-patel-misspells-pawan-kalyans-name-in-her-birthday-post1

ఈ క్రమంలో ‘కొమరం పులి’ చిత్రంలో పవన్ కు జోడీగా నటించిన నికీషా పటేల్.. పవన్ బర్త్ డే సందర్భంగా ఆయనకు విషెస్ చెబుతూ ఓ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ కి ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న ‘#HappyBirthdayPawalaKalyan, #HappyBirthdayPawanaKalyanfromSSMBfans, #HappyBirthdayPawalaKalyan #HappyBirthdayPSPK #pawankalyan’ హ్యాష్ ట్యాగ్‌లను జత చేసి పోస్ట్ చేసింది. తొందరలో పవన్‌కి బదులుగా పావలా అని ఉన్న హ్యాష్ ట్యాగ్‌ను గుర్తించకపోవడంతో అదే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేసేసింది నికీషా. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆమె పై ట్రోలింగ్ మొదలుపెట్టారు. తప్పు గ్రహించిన నికీషా వెంటనే ఆ ట్వీట్ ని డిలీట్ చేసి పవన్ అభిమానులకు క్షమాపణలు చెప్పి కొత్తగా మరో ట్వీట్ చేసింది. ఛాన్స్ దొరికింది కదా అని.. ఈ ట్వీట్ ను స్క్రీన్ షాట్ తీసి మరికొంత మంది పవన్ ఫ్యాన్స్ ను ఆడేసుకున్నారు. నికిషా పటేల్ చేసిన ఈ ట్వీట్ మాత్రం పెద్ద దుమారమే రేపిందని చెప్పాలి.

Share.