‘కలర్ ఫోటో’ చిత్రాన్ని నిహారిక రిజెక్ట్ చెయ్యడానికి గల కారణాలు ఇవే..!

మెగా డాటర్ నిహారిక పలు టీవీ షోలతోనూ అలాగే వెబ్ సిరీస్ లతోనూ పాపులర్ అయిన తరువాత.. సినిమాల్లోకి కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రం ‘ఒక మనసు’ తో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ చిత్రం ఫలితం ఎలా ఉన్నా.. ఆమెకు మాత్రం మంచి పేరే వచ్చింది. అయితే ఆ తరువాత నిహారిక నటించిన ‘హ్యాపీ వెడ్డింగ్’ ‘సూర్య కాంతం’ వంటి చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ఆ తరువాత నిహారిక మళ్ళీ వెబ్ సిరీస్ ల బాట పట్టింది.

తరువాత ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో నటించినప్పటికీ ఆమెది పెద్ద ప్రాముఖ్యమైన పాత్రేమీ కాదు. ఒక్క హిట్టు కొట్టాలి అనే ఆమె కోరిక మాత్రం నెరవేరలేదు. ఇదిలా ఉండగా.. ఓ మంచి హిట్టు సినిమాని ఈమె చేతులారా మిస్ చేసుకుందట. వివరాల్లోకి వెళితే..ఈ మధ్యనే ‘ఆహా’లో విడుదలయ్యి సూపర్ హిట్ గా నిలిచిన ‘కలర్ ఫోటో’ చిత్రం కోసం మొదట నిహారిక నే సంప్రదించారట. కానీ కరోనా టైములో షూటింగ్ కు హాజరవ్వడం రిస్క్ అని భావించి ఆమె ఈ ప్రాజెక్టుని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

కారణాలు ఏమైనా నిహారిక ఓ మంచి సినిమాని మిస్ చేసుకుందనే చెప్పాలి.ఈ చిత్రంలో హీరోయిన్ దీపు పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఒకవేళ నిహారిక కనుక ఈ చిత్రం చేసుంటే.. ఇలా అయినా ఆమెకు ఒక హిట్టు పడుండేది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. నిహారిక వివాహం డిసెంబర్ లో చైతన్య జొన్నలగడ్డతో జరుగబోతున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Share.