నిహారిక స్టన్నింగ్ పిక్స్ వైరల్..!

ఈ లాక్ డౌన్ టైంలోనే మెగా డాటర్ నిహారిక ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయిన సంగతి తెలిసిందే. గుంటూరు ఐజీ కొడుకు మరియు సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ అయిన చైతన్య జొన్నలగడ్డతో .. నిహారిక ఎంగేజ్మెంట్ జరిగింది. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ అంతా నిహారిక పెళ్లి పనుల్లో బిజీగా గడుపుతున్నారు. మొన్ననే గోవాలో తన ఫ్రెండ్స్ కు బ్యాచిలరేట్ పార్టీ కూడా ఇచ్చి వచ్చింది నిహారిక. ఇదిలా ఉండగా.. సడెన్ గా నిహారిక యువరాణి అవతరమెత్తి అందరినీ సర్ప్రైజ్ చేసింది.

నిజంగా ‘మగథీర’ సినిమాలో మిత్రవింద(కాజల్) ను తలపించేలా నిహారిక ఫోటోలు ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘యు అండ్ ఐ’ అనే మ్యాగ్ జైన్ కోసం నిహారిక ఈ ఫోటో షూట్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఇది పక్కన పెట్టేస్తే.. నిహారిక పెళ్లి డిసెంబర్లో ఉంటుందని ఇటీవల నాగ బాబు చెప్పుకొచ్చారు. పెళ్లి డేట్ కూడా త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని ఆయన తెలిపాడు. అంతేకాకుండా.. నిహారిక పెళ్లి .. డెస్టినేషన్ మ్యారేజ్ గా ప్లాన్ చేస్తున్నట్టు కూడా ఆయన తెలిపాడు.

అందుకు సంబంధించిన లొకేషన్ల వేటలో నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్ ఉన్నట్టు తెలుస్తుంది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. యువరాణి గెటప్ లో ఉన్న నిహారిక ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Share.