గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన నిహారిక..!

మెగా డాటర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంది తప్ప ఒక్క హిట్టు కూడా సాధించలేకపోయింది నిహారిక. వెబ్ సిరీస్ లు ‘ఢీ’ షో లకి తెచ్చుకున్న క్రేజ్ సినిమాల్లో కొనసాగించలేకపోయింది. ‘ఒక మనసు’ కాస్త పర్వాలేదనిపించినా.. ‘హ్యాపీ వెడ్డింగ్’ ‘సూర్యకాంతం’ చిత్రాలు ఘోరంగా డిజాస్టర్లు అయ్యాయి. దీంతో సినిమాలను పక్కన పెట్టేసి మళ్ళీ వెబ్ సిరీస్ ల పై దృష్టిపెట్టాలని నిహారిక నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈరోజు విడుదల చేసిన ‘సైరా’ మేకింగ్ వీడియోలో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేసింది. ముందు నుండీ తన పెదనాన్న సినిమాలో నటిస్తుందని వార్తలు వచ్చినా.. దానికి సంబందించిన క్లారిటీ మాత్రం ఈ మేకింగ్ విడియోతోనే వచ్చిందని చెప్పాలి.

niharika-roped-in-allu-arjuns-movie1

ఇదిలా ఉండగా… నిహారికకు అల్లు అర్జున్ సినిమాలో కూడా నటించే ఆఫర్ వచ్చిందట. అయితే ఇది త్రివిక్రమ్ కాదండోయ్ .. సుకుమార్ సినిమా అంట. త్రివిక్రమ్ తరువాత సుకుమార్ తో బన్నీ ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం నిహారిక అయితే బాగుంటుందని బన్నీతో సుకుమార్ చెప్పాడట. దీంతో బన్నీ ఆమెను ఒప్పించాడని సమాచారం. అయితే నిహారిక పాత్ర కు సంబందించిన వివరాలు మాత్రం తెలీలేదు. హీరోయిన్ గా ఎలాగు సక్సెస్ కాలేకపోయింది.. కనీసం ఇలాంటి సైడ్ క్యారెక్టర్లతోనైనా రాణిస్తుందేమో చూడాలి.

Share.