”ఫ్లాట్ ఖాళీ చేయాలనుకున్నా.. ఇంతలోనే..” : నిహారిక భర్త చైతన్య

మెగా డాటర్ నీహారిక భర్త జొన్నలగడ్డ చైతన్యపై పోలీస్ కంప్లైంట్ నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు ఈ విషయంపై చైతన్య క్లారిటీ ఇచ్చాడు. అపార్ట్మెంట్ వాసులు గొడవ చేయడం వలనే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశానని చెప్పిన చైతన్య.. అందరం మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకున్నామని తెలిపాడు. అయితే ముందు తన మీదే కేసు నమోదైనట్లు వార్తలు రావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఆగస్టు 10లోగా ఫ్లాట్ ఖాళీ చేస్తున్నట్లు ముందే ఓనర్ కి చెప్పినట్లు పేర్కొన్నారు. ఫ్లాట్ తీసుకున్నప్పుడే ఆఫీస్ కోసమని ఓనర్ కి చెప్పామని.. అయితే అపార్ట్మెంట్ అసోసియేషన్ కు క్లారిటీ లేకపోవడంతో వాదనకు దిగారని చైతన్య గొడవపై వివరణ ఇచ్చాడు. ఇక ఇదే విషయంపై అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీధర్ కూడా మాట్లాడాడు. అపార్ట్మెంట్ ను నీహారిక దంపతులు కమర్షియల్ గా వాడుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపారు.

Niharika Husband Chaitanya Gives Clarity On A Police Complaint1

ఆఫీస్ కోసమని ఫ్లాట్ తీసుకున్న విషయం తమకు తెలియదని.. దీంతో వాదన జరిగినట్లు తెలిపారు. అయితే ఇప్పుడు అందం కలిసి సమస్యను పరిష్కరించుకున్నామని వివరించారు. కాగా.. చైతన్య అర్ధరాత్రి పూట గొడవ చేస్తూ తమకు ఇబ్బంది కలిగిస్తున్నాడని అపార్ట్మెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తన ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారని చైతన్య అపార్ట్మెంట్ వాసులపై ఫిర్యాదు చేశాడు. ఇప్పుడు ఈ గొడవ సద్దుమణిగిందని తెలుస్తోంది.


ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Share.