అభిమానులను మూడు కోరికలు కోరిన బ్యూటీ

హీరోయిన్ల మీద తమిళనాడు కుర్రాళ్లు చూపించే అభిమానం మామూలుగా ఉండదు. మనసుకు నచ్చితే ఏకంగా గుడికట్టేస్తారు. గతంలో ఖుష్బూ, నమిత, హన్షిక లాంటి వాళ్లకు గుళ్లు కట్టేశారు. అయితే వాళ్లందరికీ ఆ గౌరవం చాలా సినిమాల తర్వాత దక్కింది. అంతే కాదు వాళ్లంతా తమిళ తంబీలకు నచ్చే ‘బొద్దు’గుమ్మలు. అయితే కేవలం రెండు సినిమాలతోనే తమిళ తంబీల మనసులో చోటు సంపాదించి, గుడి కట్టించేసుకుంది నిధి అగర్వాల్‌. మొన్న వాలెంటైన్స్‌ డే రోజు ఆ గుడి వార్తలు బయటికొచ్చాయి. తాజాగా నిధి అగర్వాల్‌ ఆ గుడిపై స్పందించింది.

నిధి అగర్వాల్‌ తన అందం, అభిన‌యంతో తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ‘స‌వ్య‌సాచి’తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’తో యువతను మనసుల్ని మెలితిప్పేసింది. ఇక కోలీవుడ్‌లో చూస్తే… జయం రవి హీరోగా వచ్చిన ‘భూమి’ లో నటించింది. ఆ తర్వాత ‘ఈశ్వరన్‌’ అనే మరో సినిమాలోనూ నటించింది. దీంతో ఈ శాండిల్‌ సుందరికి భారీగా అభిమానులు ఏర్పడ్డారు. ఆ అభిమానమే వాళ్లకే గుడి కట్టించింది. ఇటీవల ప్రేమికుల రోజున పాలాభిషేకాలు కూడా చేశారు అభిమానులు.

గుడి విష‌యం తెలిసిన నిధి అగ‌ర్వాల్ చాలా సంతోష‌పడింది. దాంతో పాటు ఓ మూడు కోరిక‌ల‌ను కూడా కోరింది. తన కోసం కట్టిన గుడిని గూడు లేనివారికి ఆశ్రయంగా ఇవ్వాలని తొలి కోరికగా కోరింది. అనాథల‌కు ఆక‌లి తీర్చ‌డం, విద్య‌ను అందించ‌డం లాంటి సేవా కార్య‌క్ర‌మాల‌కు ఆ గుడిని వినియోగించాలని కోరింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టింది. చూద్దాం అభిమానులు ఏం చేస్తారో.

 

View this post on Instagram

 

A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal)


Most Recommended Video

కాపటధారి సినిమా రివ్యూ & రేటింగ్!
దృశ్యం 2 సినిమా రివ్యూ & రేటింగ్!
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!

Share.