ప్రభాస్ అభిమానులను టెన్షన్లో పడేసిన దర్శకుడు నాగ్ అశ్విన్..!

బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ‘లస్ట్ స్టోరీస్’ ను తెలుగు ప్రేక్షకులకు ‘పిట్ట కథలు’ గా అందించారు నెట్ ఫ్లిక్స్ వారు. ఘాటు ముద్దులు, హగ్గులు,యువతను ఆకట్టుకునే బెడ్ రూమ్ సీన్లతో ఈ వెబ్ సిరీస్ ను తీర్చిదిద్దారు. దీనిని తెలుగులో తెరకెక్కించిన వారంతా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకులే..! అయినప్పటికీ ‘పిట్ట కథలు’ తెలుగు ప్రేక్షకులను ఏమాత్రం అలరించకపోయింది. ముఖ్యంగా దీని రిజల్ట్ తో ప్రభాస్ అభిమానులు తెగ టెన్షన్ పడిపోతున్నారు.

అదేంటి అసలు దీనికి ప్రభాస్ అభిమానులకు సంబంధం ఏమిటి..! అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నా..! ‘పిట్ట కథలు’ లో ఓ సిరీస్ కు నాగ్ అశ్విన్ కూడా దర్శకత్వం వహించాడు. శృతీ హాసన్ లీడ్ రోల్ పోషించిన ‘ఎక్స్ లైఫ్’ ను నాగ్ అశ్వినే తెరకెక్కించాడు. అయితే మిగిలిన ఎపిసోడ్ల కంటే కూడా ఇది మరింత నీరసంగా సాగింది. అందుకే ప్రభాస్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. అసలే ప్రభాస్ తో నాగ్ అశ్విన్ రూ.500కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.

ఈ ప్రాజెక్టుని అశ్వినీ దత్ గారు నిర్మిస్తున్నారు. అయితే ‘పిట్ట కథలు’ లో ‘ఎక్స్ లైఫ్’ సెగ్మెంట్ ను ఏమాత్రం ఆశాజనకంగా నడపలేకపోయిన నాగ్ అశ్విన్.. ప్రభాస్ తో సినిమా ఎలా తీస్తాడా అనేది ప్రభాస్ అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్నలు. అందుకే ప్రభాస్ కూడా ఈ ప్రాజెక్టుని హోల్డ్ లో పెడుతున్నాడనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.