‘సరిలేరు నీకెవ్వరు’ కోసం సరికొత్త ప్రయత్నం చేస్తోన్న విజయశాంతి..!

అవును విజయశాంతి వల్ల ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ కు పెద్ద టెన్షన్ వచ్చి పడింది. ఏంటా టెన్షన్..? వివరాల్లోకి వెళితే.. దాదాపు 13 ఏళ్ళ తరువాత ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తుంది. ఈ చిత్రంలో ఆమెది చాలా కీలక పాత్రట. ఈమె పాత్ర చుట్టూనే సినిమా తిరుగుతుందని.. అందుకే ఈ పాత్ర కోసం అనిల్ రావిపూడి విజయశాంతి ని తీసుకున్నాడని తెలుస్తుంది. అయితే తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంటానని దర్శకుడు అనిల్ రావిపూడితో విజయశాంతి చెప్పిందట. ఆయన ఇందుకు అంగీకరించాడట. అయితే ఇందులో టెన్షన్ పడటానికి ఏముంది అని అనుకుంటున్నారా?

Sarileru Neekevvaru Movie working stills

విషయం ఏమిటంటే.. విజయశాంతి కెరీర్ ప్రారంభం నుండీ ఆమెకు మరో ఆర్టిస్ట్ డబ్బింగ్ చెబుతూ వచ్చిందట. అలా ఎన్నో హిట్ చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే విజయశాంతి సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్న సినిమాలు ఎక్కువ శాతం ప్లాప్ లే ఉన్నాయట. ఇందుకే ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ కు పెద్ద టెన్షన్ పట్టుకుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ లో విజయశాంతి డైలాగ్.. ఆమె గొంతుతో వచ్చినదే. మరి ఈసారి ఫలితం ఎలా ఉండబోతుంది అనే ఉత్కంఠత అందరిలోనూ నెలకొంది.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.