ఈ సంక్రాంతికి బాక్సాఫీస్‌ దద్దరిల్లిపోతోంది: అనిల్‌ రావిపూడి

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా దిల్ రాజు శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో జి.ఎం.బి ఎంట‌ర్‌టైన్‌మెంట్, ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అనిల్‌రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మించిన ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ `స‌రిలేరు నీకెవ్వ‌రు`. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో ప్రొఫెస‌ర్ భార‌తీగా లేడీ అమితాబ్ విజ‌య‌శాంతి ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టించారు. సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త‌ రికార్డుల‌ను క్రియేట్ చేస్తూ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా హైదరాబాద్ సంస్థ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..

Sarileru Neekevvaru Movie Review2

యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ… ”అందరూ చెప్పినట్లే తెలుగు సినిమా కళకళలాడుతోంది. సంక్రాంతికి బాక్సాఫీస్‌ దద్దరిల్లిపోతోంది. ఐయాం వెరీ హ్యాపీ. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్‌ చేసి మహేష్‌గారి కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిపిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇంకా రెండు మూడు వారాలు రన్‌ ఉంది. అలాగే రిపీటెడ్‌గా చూడాలనుకునే ఆడియన్స్‌ కోసం ఒకటిన్నర నిమిషాల నిడివి గల సన్నివేశాన్ని యాడ్‌ చేస్తున్నాం. దాంతో ఇంకొంచెం నవ్వులు బోనస్‌గా లభిస్తాయి. ‘రమణా లోడు ఎత్తాలిరా’ అనే డైలాగ్‌కు మేం ఊహించినదాన్ని కన్నా ఎక్కువ రెస్పాన్స్‌ వచ్చింది.అందుకే మేము కూడా ‘రమణా బాక్సాపీస్ లోడ్ ఎత్తాలిరా’ అంటున్నాం. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని ఎంతో గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు” అన్నారు.


సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Share.