రామ్‌ కొత్త సినిమాలో మార్పులు… నిజమా?

కొత్త సినిమా విషయంలో రామ్‌ ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నాడా? లేక వెంట వెంటనే రెండు సినిమాలు చేసి అభిమానులను ఖుష్‌ చేద్దాం అనుకుంటున్నాడా? ఎందుకంటే ఇటీవల లింగు స్వామి సినిమాను రామ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తర్వాతి సినిమాను కూడా ఓకే చేసేశాడట. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌ తర్వాతి సినిమా ఉండబోతోందనేది తాజా ఖబర్‌. అయితే ఈ వార్తతో పాటు మరో పుకారు కూడా యాడ్‌ అయ్యి… ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ఈ ఏడాది ‘రెడ్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్‌ నిరాశపరిచాడు. దీంతో తర్వాతి సినిమా విషయంలో బాగా ఆలోచించి లింగుస్వామి కథను ఓకే చేసుకున్నాడట. అయితే ఈ సినిమా కథ విషయంలో రామ్‌ వేలుపెడుతున్నాడని కూడా వార్తలొచ్చాయి. ఈలోగా హీరోయిన్‌ ఎంపిక కూడా ప్రకటించారు కాబట్టి సినిమా పట్టాలెక్కడమే ఆలస్యం అనుకున్నారు. అయితే ఇప్పుడు బోయపాటి సినిమా ముచ్చట్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు లింగుస్వామి సినిమా కంటే ముందు బోయపాటి సినిమా ఉంటుందనేది కొత్త పుకారు.

లింగుస్వామి సినిమాలో ‘ఉప్పెన’ భామ కృతి శెట్టిని ఇప్పటికే ప్రకటించారు. సినిమా కథ, కథనం అంతా సిద్ధం అంటున్నారు. ఈ సమయంలో ఈ కన్‌ఫ్యూజ్‌ పుకార్లు రావడం ఏంటో అర్థం కావడం లేదు. ఒకవేళ ఇదే నిజయమైతే… బోయపాటి సినిమా మొదలవ్వడానికి మరో మూడు నెలలైనా పడుతుంది. బాలకృష్ణ సినిమా అయ్యాకే బోయపాటి ఖాళీ అవుతారు కాబట్టి. చూద్దాం పుకార్లు నిజమవుతాయో లేదో.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Share.