రామ్‌ – లింగుస్వామి సినిమా ఆలోచనల్లో ఉందట

కోలీవుడ్‌ టాప్‌ మాస్ డైరక్టర్ల లిస్ట్‌లో తక్కువ సమయంలోనే చోటు సంపాదించేశారు లింగు స్వామి. వరుసగా మాస్‌ సినిమాలు చేసుకుంటూ స్టార్‌ హీరోల దృష్టిలో పడ్డాడు. అయితే ఆ తర్వాత అతని సినిమాల్లో అంతగా పస కనిపించలేదు. దీంతో ఈ మధ్య కాలంలో ఎక్కడా ఆ పేరు పెద్దగా వినిపించడం లేదు. అల్లు అర్జున్‌తో సినిమా అంటూ చాలా రోజుల క్రితంలో టాలీవుడ్‌లోనూ లింగుస్వామి పేరు వినిపించింది. అయితే ఆ సినిమా అప్పుడు మెటీరియలైజ్‌ కాలేదు. అయితే ఇప్పుడు మరోసారి టాలీవుడ్‌లో లింగుస్వామి పేరు వినిపిస్తోంది. అయితే ఈసారి రామ్‌ సినిమా కోసం.

‘రెడ్‌’ సినిమా తర్వాత రామ్‌ కొత్త సినిమా ప్రకటనేమీ రాలేదు. వరుసగా కథలు వింటున్నా.. ఇంకా ఏదీ ఓకే చేయడం లేదు. సరైన కథ దొరకాలి, అది తన రీసెంట్‌ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఉండాలని అనుకుంటున్నాడట. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో మళ్లీ మాస్‌ బాట పట్టిన రామ్‌.. అందుకు తగ్గట్టుగా ‘రెడ్‌’ చేశాడు. ఇప్పుడు దానిని కంటిన్యూ చేస్తూ మాస్‌ సినిమా చేయాలనుకుంటున్నాడట. అందుకే లింగుస్వామి కథ విన్నాడట. కథ, ఇతర విషయాలు దాదాపుగా కొలిక్కి వచ్చాయట. ఈ సినిమాను స్రవంతి రవికిషోర్‌ నిర్మించబోతున్నట్లుగా సమాచారం.

నిజానికి ‘రెడ్‌’ తర్వాత రామ్‌ – త్రివిక్రమ్‌ సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. #ఎన్టీఆర్‌30 చిత్రీకరణ ఆలస్యమవుతుండటంతో రామ్‌తో సినిమా చేస్తారనే వార్తలు వచ్చాయి. ‘రెడ్‌’ ప్రచార కార్యక్రమంలో త్రివిక్రమ్‌ కనిపించడంతో ఈ వార్తలకు ఊతమిచ్చినట్లు అయ్యింది. అయితే ఎన్టీఆర్‌ 30 పనులు త్వరలో మొదలు అని సిగ్నల్స్‌ వస్తున్నాయి. ఇప్పుడు రామ్‌ – లింగుస్వామి వార్తలు వస్తుండటం చూస్తుంటే, ఇదే ఫైనల్‌ అయ్యేలా కనిపిస్తోంది.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Share.