Singer Sunitha: వాట్సాప్ నెంబర్ అడిగిన నెటిజన్ కు సింగర్ రిప్లై!

సింగర్ సునీత ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన అభిమానులతో తరచూ మాట్లాడుతూ ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో జాగ్రత్తగా ఉందామంటూ సూచిస్తోంది. అయితే ఇప్పుడున్న భయాలు, ఆందోళనలను దూరం చేసేలా అందరితో ముచ్చటిస్తూ.. తన పాటలతో ఉపశమనం కనిపిస్తోంది. తన పాటలతో కొంతమందైనా.. సంతోషంగా ఉంటున్నారంటూ.. వారికోసం ప్రతిరోజూ ఓ అరగంట సమయం కేటాయిస్తానని సునీత చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కరోనా ఇంతగా విజృంభిస్తుండడంతో అందరూ సాయం కోసం అడుగుతున్నారని.. అడిగిన వారందరికీ సాయం చేయలేకపోతున్నామని చెప్పింది సునీత.

మనకున్న పరిధిలో వీలైనంత సాయం చేయాలని.. తనకు తెలిసిందంతా పాడడమే అని.. అందుకే ఇలా అందరినీ సంతోషపెట్టే ప్రయత్నం చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్థిరోజూ రాత్రి ఎనిమిది గంటలకు సునీత లైవ్ లోని వస్తుంది. మొదటిసారి శుక్రవారం రాత్రి 8 గంటలకు సునీత లైవ్ లోకి వచ్చి తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టారు. ఫ్యాన్స్ అడిగిన పాటలను ఆలపిస్తూ వారిని ఖుషీ చేసింది.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తనకు చాలా మంది పాటలు పాడమని అడుగుతున్నారని.. అందుకే ఇలానే రోజూ ఓ అర్ధగంట లైవ్ పెడతానని సునీత చెప్పుకొచ్చింది. చెప్పినట్లుగా రోజూ లైవ్ లోకి వస్తోంది. తన ఫాలోవర్లు పెడుతోన్న కామెంట్స్ ను చదువుతోంది. ఓ నెటిజన్ మాత్రం ఏకంగా సునీతను వాట్సాప్ నంబర్ చెప్పమని అడిగాడు. దీంతో సునీత సో సారీ అండీ అంటూ నవ్వుతూనే తిరస్కరించింది.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Share.