సౌందర్య అభిమానులకు ఇది మంచి గిఫ్టే..!

హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా బాలకృష్ణ త్రిపాత్రాభినయం వహించిన ‘నర్తనశాల’ చిత్రానికి సంబంధించి 17 నిమిషాల ఫుటేజ్ ను రేపు ఎటిటిలో విడుదల చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. సౌందర్య ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడంతో ఈ చిత్రం అర్థాంతరంగా ఆగిపోయిందనే ప్రచారం కొన్నాళ్ళు.. ఆ పై బడ్జెట్ సమస్యల కారణంగా ఆగిపోయింది మరికొన్నాళ్ళు జనల నోట్లో నానింది ఈ చిత్రం. ఏది ఏమైనా దసరా కానుకగా ‘నర్తనశాల’ 17 నిమిషాల ఫుటేజ్ ను చూడడానికి మాత్రం నందమూరి అభిమానులతో పాటు భక్తిరస చిత్రాలని అభిమానించే వారు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్లో బాలకృష్ణ, సౌందర్యలతో పాటు శరత్ బాబు, శ్రీహరి వంటి వారు కూడా కనిపిస్తున్నారు. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లడాన్ని.. ముందుగా చూపిస్తూ ట్రైలర్ ప్రారంభమయ్యింది. సౌందర్య, శ్రీహరి వంటివారు ఈ లోకంలో లేరు కాబట్టి వారి పాత్రలకు వేరే వారితో డబ్బింగ్ చెప్పించారు.గతంలో కూడా సౌందర్య సినిమాలకు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పారు కాబట్టి అది పెద్ద లోటుగా అనిపించదు.

అయితే శ్రీహరి పాత్రకు డబ్బింగ్ అంతగా యాప్ట్ అవ్వలేదు అనిపించింది. కెమెరా పనితనం మాత్రం బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. డబ్బింగ్ లోటుపాట్లు పక్కన పెట్టేస్తే.. ఈ టీజర్ లాంటి ట్రైలర్ బాగానే ఉందని చెప్పాలి.


టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Share.