నయనతార-విగ్నేష్ శివన్ వివాహానికి సిద్దమవుతున్నారట

స్టార్ హీరోయిన్ గా సౌత్ ని ఏలేస్తున్న నయనతార జీవితం ఎప్పుడూ వివాదాల మయమే. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే హీరో శింబుని ప్రేమించింది. ఏళ్ల తరబడి ప్రేమించుకున్న ఈ జంట చట్టా పట్టాలేసుకొని పబ్లిక్ గా తిరిగారు. వీరిద్దరి ప్రైవేట్ పిక్స్ కూడా అప్పట్లో హల్ చల్ చేశాయి. ఏమైందో తెలియదు ఇద్దరు కొన్నాళ్ల తరువాత బై బై చెప్పేసుకున్నారు. ఆయనతో విడిపోయిన వెంటనే భార్య, పిల్లలు ఉన్న ప్రభుదేవా ప్రేమలో పడింది.

ఈమె కోసం ప్రభుదేవాకు విడాకులు ఇచ్చారు. ఒక వివాహితుడిని ప్రేమించి, ఎవరేమనుకున్నా డోంట్ కేర్, నచ్చింది చేస్తా అని నిరూపించుకుంది. ప్రభుదేవాతో ప్రేమ కూడా పెళ్లి వరకు వెళ్ళలేదు. ఆయనతో బ్రేక్ అప్ తరువాత నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమలో పడింది. ప్రస్తుతం ఆయనతో ముచ్చటగా మూడో లవ్ స్టోరీ నడుపుతుంది. రెండేళ్లకు పైగా ప్రేమించుకుంటున్న ఈ జంట వీలు చిక్కినప్పుడల్లా విహార యాత్రలకు వెళతారు. ఒకరి ఒకరు కాస్ట్లీ గిఫ్ట్ లు ఇచ్చుకుంటూ ఉంటారు.

విగ్నేష్ తో కూడా నయనతార విడిపోవనుంది అప్పట్లో వార్తలు వచ్చాయి. ఐతే వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారట. ముఖ్యంగా విగ్నేష్ కుటుంబం త్వరగా ఆయనకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారట. దీనితో ఈ ఏడాదే నయన మరియు విగ్నేష్ పెళ్లి పీటలు ఎక్కే అవకాశం కలదు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video

రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Share.