అందుకే నయన తార ప్రమోషన్లకి రాలేదా..?

మెగాస్టార్ 151 వ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. అక్టోబర్ 2 న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే తెలుగు రాష్ట్రాలు మినహా మిగిలిన చోట్ల ఈ చిత్రానికి కనీసం కలెక్షన్లు రావడం లేదు. ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ చిత్రంలో నరసింహా రెడ్డి భార్యగా స్టార్ హీరోయిన్ నయన తార నటించింది. ఇక నరసింహా రెడ్డి ప్రియురాలిగా తమన్నా నటించింది. అయితే నయనతార పాత్ర కంటే తమన్నా పాత్రే బాగుందని ప్రేక్షకులు చెబుతున్న సంగతి తెలిసిందే.

8-sye-raa-title-song

ఈ విషయం పైనే నయన కు ‘సైరా’ యూనిట్ తో మనస్పర్థలు ఏర్పడినట్టు తెలుస్తుంది. అందుకే సినిమా ప్రమోషన్లకు కూడా ఈమె దూరంగా ఉందంటూ వార్తలు వస్తున్నాయి. సినిమాలో తమన్నా స్క్రీన్ ప్రెజెన్స్ అలాగే ఇంపార్టెన్స్ కాస్త ఎక్కువే..! కాదనలేము..! కానీ ఈ చిత్రానికి గాను నయన్ కు ఏకంగా 6 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చారు. అలాగే ఈమె గత సినిమాలకి కూడా ప్రమోషన్లకు వచ్చిన దాఖలాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఈమె ఇలా అనడం అనేది కరెక్ట్ కాదనే చెప్పాలి. అసలు ఈ ప్రచారంలో ఎంతవరకూ నిజముందనేది కూడా పెద్ద ప్రశ్నే ..!

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Share.